Begin typing your search above and press return to search.
మహేష్.. రాజమౌళి సినిమా ఇంట్రెస్టింగ్ 'ఇంగ్లీష్' అప్‌డేట్
By: Tupaki Desk | 5 March 2023 11:23 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి 'ఆర్ఆర్‌ఆర్' సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ కు ఆయన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ను హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తో హాలీవుడ్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబు హీరోగా రూపొందించబోతున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు తో జక్కన్న రూపొందించబోతున్న సినిమా ను హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించేందుకు ముందుకు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ఇంగ్లీష్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబోతున్నారట.
సినిమాలోని కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా ఇంగ్లీష్ లో చిత్రీకరణ చేయాలని కూడా జక్కన్న భావిస్తున్నాడట. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు ఇంగ్లీష్ నటీ నటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అనేది టాక్.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న మహేష్.. జక్కన్న సినిమా తో తెలుగు సినిమా ఖ్యాతి.. ఇండియన్ సినిమా ఖ్యాతి ఎక్కడికో విస్తరిస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.
అంతకు మించి అన్నట్లుగా మహేష్ బాబు తో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా ఉంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.