Begin typing your search above and press return to search.

ఛాన్స్ దొరికింది.. సమంతపై మహేష్ ఫ్యాన్స్ టార్గెట్

By:  Tupaki Desk   |   13 July 2023 11:06 AM GMT
ఛాన్స్ దొరికింది.. సమంతపై మహేష్ ఫ్యాన్స్ టార్గెట్
X
కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ ఈ సామేత ఎప్పుడైనా విన్నారా..?మనం ఎదుటివారికి ఏదైతే చేస్తామో, తిరిగి మనకు అదే జరుగుతుంది అని దాని అర్థం. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అదే జరుగుతోంది. ఒకప్పుడు ఏ విషయం లో అయితే ఆమె అసహనం వ్యక్తం చేసిందో, ఇప్పుడు అదే సమంత కూడా చేసింది. దీంతో, నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ వన్ నేనొక్కడినే అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ పాటలో మహేష్ ముందు నడుస్తుంటే, వెనక కృతి సనన్ పాకుతూ ఉంటుంది. ఈ మూవీ సమయంలో ఇలాంటి పోస్టర్ ని విడుదల చేయగా, దానిపై సమంత అసహనం వ్యక్తం చేసింది.

ఆడవారిని కించపరిచారు అంటూ, మూవీ పేరు, ఆ ప్రస్తావ తీసుకురాకుండా ఆమె అలా తీయడానికి వ్యతిరేకించారు. ఈ విషయంలో సమంతకు చాలా సార్లు ఎదురుదెబ్బ తగిలింది. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఇలాంటి సీన్ ఒకటి ఉండగా, అప్పుడు కూడా నెటిజన్లు సమంతను తిట్టపోశారు. తాజాగా, మరోసారి ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

సమంత తాజా చిత్రం ఖుషీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాలోని ఆరాధ్య అనే పాటను విడుదల చేశారు. అందులో సమంత చేతిని విజయ్ దేవర కొండ కాలితో టచ్ చేసినట్లుగా ఉంది.

అంతే ఆ ఫోటో బయటకు వచ్చిన వెంటనే సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు మహేష్ ని విమర్శించావు కాదా, మరి ఈ రోజు నువ్వు చేసింది ఏంటి? అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

కర్మ హిట్ బ్యాక్ సమంత అంటూ ఆమెను సోషల్ మీడియాలో విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి..? ఇది అమ్మాయిలను కించపరచడం కాదా? ఇప్పుడు నీ మనోభావాలు దెబ్బతినలేదా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరి ఈ కౌంటర్లకు సమంత ఎలాంటి బదులు చెప్పనుందో తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఖుషీ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.