Begin typing your search above and press return to search.
జక్కన్నకు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్
By: Tupaki Desk | 12 Jan 2021 7:30 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న రాజమౌళిల కాంబో మూవీ కోసం అపభిమానులు గత రెండేళ్ల కాలంగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేయాల్సి ఉందని జక్కన్న ఒకానొక సమయంలో చెప్పాడు. కాని కొన్ని కారణాల వల్ల బాహుబలి తర్వాత జక్కన్న 'ఆర్ఆర్‌ఆర్' సినిమాను పట్టాలెక్కించాడు. ఆమద్య ఒక ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఖచ్చితంగా మమేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి అన్నాడు. ఆయన మాటలను బట్టి ఈసారి ఖచ్చితంగా మహేష్ బాబుతోనే సినిమా ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఆ కారణంగానే అభిమానులు అంచనాలు భారీగా పెంచేసుకున్నారు.
మహేష్ బాబును ఒక విభిన్న రీతిలో రాజమౌళి చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల ఒక యాడ్ లో మహేష్ బాబు బాలీవుడ్ హీరోతో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇలాంటి రాజమౌళి దర్శకత్వంలో చేస్తే అద్బుతంగా ఉంటాయి అనేది మహేష్ అభిమానుల అభిప్రాయం. అందుకే మహేష్ బాబును ఒక యాక్షన్ డ్రామా కథలో భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటింపజేయాలని అభిమానులు రాజమౌళిని కోరుతున్నారు. ఆర్‌ఆర్ఆర్ సినిమా పూర్తి అయ్యే వరకు మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను చేయాలనే ఆలోచన కూడా జక్కన్న చేయక పోవచ్చు. అయినా కూడా అభిమానులు మాత్రం ఆయనకు రిక్వెస్ట్ లు పెడుతూనే ఉన్నారు.