Begin typing your search above and press return to search.
రజినీ తర్వాత మహేష్..
By: Tupaki Desk | 19 Sep 2017 1:30 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తమిళ సూపర్ స్టార్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఏ విషయంలో అంటారా..? ట్విట్టర్ ఫాలోయింగ్ లో. సౌత్ ఇండియాలో ధనుష్ (5.7 మిలియన్లు) రజినీకాంత్ (4.18 మిలియన్లు) తర్వాత అత్యధిక ఫాలోవర్లున్న స్టార్ హీరో మహేష్ బాబే కావడం విశేషం. మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్ల మైలురాయిని దాటింది.
ధనుష్.. రజినీల తర్వాత సౌత్ హీరోల్లో 4 మిలియన్ ఫాలోవర్ల మార్కును దాటిన ఘనత మహేష్ బాబుదే. మహేష్ 2010 జూన్ నెలలో ట్విట్టర్లో అడుగుపెట్టాడు. అతను ట్విట్టర్లో మరీ యాక్టివ్ ఏమీ కాదు. అప్పుడప్పుడూ మాత్రమే ట్వీట్లు పెడుతుంటాడు. అయినప్పటికీ ఈ స్థాయి ఫాలోయింగ్ రావడం విశేషం. ‘స్పైడర్’ సినిమాతో కోలీవుడ్ జనాల్ని కూడా ఆకర్షించడంతో గత కొన్ని నెలల్లో మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య బాగా పెరిగింది.
మరో టాలీవుడ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే 2 మిలియన్ ఫాలోవర్ల మార్కును దాటాడు. ఐతే పవన్ ట్విట్టర్లోకి వచ్చి నాలుగేళ్లే అయింది. అతను అప్పుడప్పుడూ పొలిటికల్ ట్వీట్లు తప్పిస్తే.. సినిమా ముచ్చట్లు ఎప్పుడూ పంచుకున్నది లేదు. సౌత్ ఇండియన్ సెలబ్రెటీల్లో సమంత (4.61 మి).. త్రిష (3.98 మి).. రానా దగ్గుబాటి (3.66 మి).. రాజమౌళి (3.59 మి).. అక్కినేని నాగార్జున (3.41 మి) సూర్య (2.58 మి)లకు కూడా భారీగా ఫాలోవర్లున్నారు.