Begin typing your search above and press return to search.

మహేష్.. ఫ్యామిలీతో మళ్ళీ అదే ప్లాన్

By:  Tupaki Desk   |   28 April 2023 3:35 PM GMT
మహేష్.. ఫ్యామిలీతో మళ్ళీ అదే ప్లాన్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏ కొంచెం సమయం దొరికినా తన ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తుంటారు. భార్యా పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిపోతారు సూపర్ స్టార్ మహేష్ బాబు. పిల్లలతో కలిసి అలా జాలీగా ఫారిన్ ట్రిప్ కు వెళ్లిరావడం ఆయనకు చాలా ఇష్టం కూడా.

ఈ విషయం చాలా సమయాల్లో బయటపడింది కూడా. తాజాగా మరోసారి ఇది రుజువైంది. తాజాగా మహేష్ బాబు విదేశాలకు వెళ్తూ కనిపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సూపర్ స్టార్ తన భార్య పిల్లలతో కలిసి కనిపించారు. టూర్ మూడ్ లో ఉన్నట్లు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.

మహేష్ బాబు, భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార నలుగురు కలిసి కారు దిగి ఎయిర్ పోర్టులోకి వెళ్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నలుగురు నాలుగు చిన్న సైజు బ్యాక్ ప్యాక్ లు ధరించి కనిపించారు. మహేష్ బాబు బ్లూకలర్ ఫుల్ స్లీవ్స్ రౌండ్ నెక్ టీ షర్టు ధరించాడు. నెత్తిపై అడిడాసస్ క్యాప్ పెట్టుకున్నారు. సన్ గ్లాసెస్‌ తో స్టైలిష్ గా కనిపించారు.

ప్రస్తుతం SSMB28 చిత్రం చేస్తున్నారు మహేష్ బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుండి కాస్తంతా సమయం దొరగ్గానే మహేష్ బాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. కొన్ని షెడ్యుల్స్ మాత్రం పెండింగ్ లో ఉన్నాయి.

తాజాగా SSMB28 షూటింగ్ ఆగిపోయిందని, మహేష్ బాబుకు, త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు వచ్చాయని అందుకే సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ రూమర్స్ పై స్పందించిందిన నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా వాటికి పుల్‌ స్టాప్ పెట్టారు.

అంతా సవ్యంగానే జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. గాసిప్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. SSMB28 కచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.