Begin typing your search above and press return to search.

'కోటి వృక్షార్చన'కు నేను సైతం అంటూ మహేష్‌

By:  Tupaki Desk   |   15 Feb 2021 4:12 AM GMT
కోటి వృక్షార్చనకు నేను సైతం అంటూ మహేష్‌
X
తెలంగాణ ఎంపీ సంతోష్‌ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు అయ్యి తమ అభిమానులతో మొక్కలు నాటించారు. ఎంపీ సంతోష్‌ ఈనెల 17వ తారీకున సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా మరో భారీ కార్యక్రమాన్ని తలపెట్టారు. కోటి వృక్షార్చన పేరుతో దాదాపుగా కోటి వృక్షాలను ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా నాటే కార్యక్రమంను తలపెట్టాడు. ఒకే రోజున కోటి వృక్షాలు అంటే మామూలు విషయం కాదు. కాని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యకర్తలు మరియు ప్రముఖుల పిలుపుతో ఈ కార్యక్రమం సాధ్యం అంటూ టీఆర్‌ఎస్ వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇక మహేష్‌ బాబు కూడా ఎంపీ సంతోష్‌ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంకు మద్దతుగా నిలిచారు.

మహేష్‌ బాబు తన ట్విట్టర్ అకౌంట్‌ లో వీడియోను షేర్‌ చేయడంతో పాటు ఈ నెల 17న పెద్ద ఎత్తున మొక్కలను నాటాలంటూ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఎంపీ సంతోష్‌ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. గ్లోబల్ వార్మింగ్‌ ను తగ్గించేందుకు చెట్లు నాటేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటూ గౌతమ్‌ మరియు సితారలతో కలిసి మొక్కలు నాటిన వీడియోను కూడా మహేష్‌ బాబు షేర్‌ చేశారు. ప్రతి ఒక్కరు కూడా కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటూ మహేష్ బాబు పిలుపునివ్వడం అభినందనీయం.