Begin typing your search above and press return to search.
వీడియో : మహేష్ సంతూర్ డాడీ
By: Tupaki Desk | 6 Sep 2019 5:03 AM GMTనాగార్జున ఆరు పదుల వయసుకు వచ్చినా కూడా అలా కనిపించడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న నాగార్జున తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫ్యాన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న స్టార్ హీరో మహేష్ బాబు. ఎప్పుడు చూసినా అందంగా కనిపించడం.. సినిమా సినిమాకు వయసు తగ్గి మరీ కనిపించడం మహేష్ బాబు స్పెషాలిటీ అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. మహేష్ బాబు తన 25వ చిత్రం 'మహర్షి' చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నాడు.
ఆర్మీ మేజర్ గా మహేష్ బాబు ఆ చిత్రంలో కనిపించబోతున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమా కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే మహేష్ బాబు సంతూర్ యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు లో తెరకెక్కిన ఈ యాడ్ లో మహేష్ బాబు లుక్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల వచ్చిన 'మహర్షి' చిత్రంలో కంటే మరింత యంగ్ గా మహేష్ బాబు ఈ యాడ్ లో కనిపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ అంటున్నారు.
ఆ యాడ్ లో మహేష్ బాబు ఒక లేడీని చూసి తన సినిమాలో హీరోయిన్ అనుకుంటూ ఉండగా ఒక పాప వచ్చి మమ్మీ అంటుంది. అచ్చు అలాగే మహేష్ బాబు కూడా ఉంటాడు. టీనేజ్ కుర్రాడికి తండ్రి మహేష్ బాబు అంటే ఆశ్చర్యపోతారేమో. మహేష్ బాబు గురించి ఏమీ తెలియని వారికి ఆయన్ను చూపించి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నమ్మక పోవడంతో పాటు పెళ్లి అయ్యిందా అంటూ ఆశ్చర్య పోతారేమో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు తన కొత్త సంతూర్ మమ్మీ యాడ్ తో ఫ్యాన్స్ ను మెప్పించాడు.