Begin typing your search above and press return to search.

మహేష్ వదిలిన ప్రేమ విమానం టీజర్… చిన్నారుల కల

By:  Tupaki Desk   |   27 April 2023 12:05 PM GMT
మహేష్ వదిలిన ప్రేమ విమానం టీజర్… చిన్నారుల కల
X
ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ లు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. అలాగే లో బడ్జెట్ తో ఓటీటీ ఫిలిమ్స్ కూడా సందడి చేస్తున్నాయి. ఇంటరెస్టింగ్ కంటెంట్ తీసుకొని దానికి దృశ్యరూపం ఇస్తూ ప్రేక్షకులని కొత్త దర్శకులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జెనరేషన్ ని కరెక్ట్ గా అర్ధం చేసుకొని డీసెంట్ కాన్సెప్ట్ తో వెబ్ ఫిలిమ్స్ ని నిర్మించేవారు ఎక్కువ అయ్యారు.

తాజాగా అలాంటి కథాంశంతోనే ప్రేమ విమానం జీ ఒరిజినల్ ఫిలిం గా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఈ వెబ్ ఫిలిం టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత శోభన్ ఈ మూవీలో హీరోగా కనిపిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

వెన్నెలకిషోర్ కూడా మంచి ఫన్ టచ్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే ఆకాశంలో విమానం ఎగరడం చూసిన ఇద్దరు పిల్లలు ఎప్పటికైనా అందులో ప్రయాణం చేయాలని కలలు కంటూ ఉంటారు. దీంతో విమానం గురించి వారికున్న డౌట్స్ ని స్కూల్ టీచర్ వెన్నెల కిషోర్ ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఆ పిల్లల తల్లిగా అనసూయ కనిపిస్తోంది.

మధ్యలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇక విమానం ఎక్కాలని ఆ పిల్లలు ఇద్దరు కూడా ఊరి నుంచి హైదరాబాద్ కి పారిపోయి వచ్చేస్తారు.

అక్కడ వారు ఎలాంటి సిచువేషన్స్ పేస్ చేశారు అనేది టీజర్ లో చూపించి కథ ఎలా ఉండబోతోంది దర్శకుడు సంతోష్ కోటా చెప్పేశారు. ఇక ఇద్దరు చైల్డ్ యాక్టర్స్ గా దేవాన్ష్ నామా, అనిరుద్ నామా నటించారు.

ఇక అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ మూవీని నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఓవరాల్ గా మూవీ టీజర్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఓటీటీ ఫిలిం కాబట్టి ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడగలిగే విధంగా ఈ మూవీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. త్వరలో ఈ వెబ్ ఫిలిం రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని టీజర్ తో క్లారిటీ ఇచ్చారు.