Begin typing your search above and press return to search.

మహేష్ తో ఎవరు చేస్తున్నారబ్బా?

By:  Tupaki Desk   |   14 Dec 2017 2:30 AM GMT
మహేష్ తో ఎవరు చేస్తున్నారబ్బా?
X
ఎన్నో ఆశలు పెట్టుకుని ఓ రేంజిలో ఆడుతుందని ఆశలు పెట్టుకున్న స్పైడర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మహేష్ తన దృష్టి మొత్తం కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను మూవీ పైనే పెట్టాడు. కొరటాల వరస హిట్లతో ఫామ్ లో ఉండటం.. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో భరత్ అనే నేను కచ్చితంగా అభిమానులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా మహేష్ భరత్ అనే నేను తరవాత ఏ సినిమా చేస్తాడన్న దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఈ ఏడాది మొదట్లో కొరటాల శివ.. వంశీ పైడిపల్లి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయబోతున్నానని మహేష్ చెప్పాడు. వీటిల్లో ఇంతవరకు కొరటాల మూవీ ఒక్కటే పట్టాలెక్కింది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి పైనే పూర్తి దృష్టి పెట్టాడు. దీని తరవాత అజ్ఞాతవాసి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ బ్యానర్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ప్రస్తుతం హారిక అండ్ హాసిని యూనిట్ విక్టరీ వెంకటేష్ తో సినిమా అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలుకావడానికి మరికొంత కాలం పడుతుందనే మాట వినిపిస్తోంది. మరి ఈలోగా మహేష్ సినిమా మొదలెడతాడా అన్నదానిపై ఎవరూ పెదవి విప్పడం లేదు.

మహేష్ చెప్పిన వాటిలో వంశీ పైడిపల్లి సినిమా గురించి ఇంతవరకు చడీ చప్పుడు లేదు. ఈ సినిమా మొదలయ్యే అవకాశం భరత్ అను నేను రిలీజయ్యాకనే ఉంటుంది. రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని మహేష్ ఆశ పడినప్పటికీ ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్- రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ స్టార్ట్ చేసే పనిలో పడ్డాడు. అలాగే త్రివిక్రమ్ సినిమా కూడా అప్పుడే వర్కవుట్ అయ్యేలా లేదు. చూస్తుంటే.. పెద్ద డైరక్టర్లు మహేష్‌ కు హ్యాండిస్తున్నట్లున్నారే.