Begin typing your search above and press return to search.

కండలు పెంచుతున్న మహేష్.. ఎవరికోసమబ్బా?

By:  Tupaki Desk   |   2 March 2023 11:03 AM GMT
కండలు పెంచుతున్న మహేష్.. ఎవరికోసమబ్బా?
X
టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరోల్లో మహేష్‌ బాబు ఒకడు. వయసు 50 ఏళ్లకు చేరువవుతున్నా.. యంగ్ లుక్లో కనిపిస్తాడు ఈ సూపర్ స్టార్. ప్రస్తుతం మహేశ్ బాబు తన 28వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ28 గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అతని మేకోవర్‌ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న ఈ మూవీ కోసం మహేష్‌ సరికొత్త లుక్‌లో అదరగొడుతున్నాడనే చెప్పాలి. ఈ సినిమా కోసం జిమ్‌ లోనూ మహేశ్ బాగానే చెమటోడుస్తున్నాడు. మామూలుగానే ఎప్పుడూ యంగ్‌ లుక్‌ లోనే మహేష్‌ కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇక ఇప్పుడు సినిమా కోసం తన కసరత్తులను కాస్త ఎక్కువ చేశాడనే చెప్పాలి. పర్సనల్ ట్రైనర్‌ సమక్షంలో మహేష్ వర్కౌట్‌ చేస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఆ ఫోటోలో సిక్స్ ప్యాక్ బాడీలో మహేష్ కనిపిస్తున్నాడు. డంబెల్స్‌ తో మహేశ్ వర్కౌట్ చేయడం ఇందులో చూడొచ్చు. తన డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌, లైట్‌గా గడ్డంతో మహేష్ ఇంకా హాట్‌ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ బాబు రెడీ అవుతున్నాడు అని... కామెంట్స్ పెడుతున్నారు. ఎస్ఎస్ఎంబీ28 మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా కోసమా.. లేేదా నెక్ట్స్ రాజమౌళి కోసమా మహేశ్ కసరత్తులు అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఎస్ఎస్ఎంబీ28లో మహేష్‌ తన లుక్స్‌తో చంపేసేలా ఉన్నాడనే చెప్పాలి. అతడు, ఖలేజా సూపర్‌ హిట్‌ మూవీలు అందించిన తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మధ్యే కాలికి గాయం చేసుకున్న ఆమె కోసం ఎస్ఎస్ఎంబీ28 మూవీ టీమ్‌ వెయిట్ చేస్తోంది. ఈ మూవీ తర్వాత రాజమౌళితో కలిసి మహేష్‌ బాబు ఓ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చేయనున్న విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.