Begin typing your search above and press return to search.
మరో బ్రాండ్ కి అంబాసడర్ గా సూపర్ స్టార్
By: Tupaki Desk | 26 Feb 2018 7:07 AM GMTఈమధ్య సినిమాలు సైన్ చేయడం కంటే ఎదో ఒక పెద్ద బ్రాండ్ చూసి బ్రాండ్ అంబసడర్లు గా సైన్ చేయడానికి ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం తక్కువ కాదు. ఇప్పటికే రెండు బ్రాండ్ లను రెప్రెసెంట్ చేస్తూనే ఇంకో బ్రాండ్ కి ఓకే చెప్పేశాడు మన ప్రిన్స్.
మహేష్ ఇప్పటికే తమ్స్ అప్ అనే సాఫ్ట్ డ్రింక్ మరియు పారగాన్ చెప్పుల బ్రాండ్ కి అంబాసడర్ గా ఉన్నాడు. ఇపుడు రీసెంట్ గా ప్రోటినేక్స్ అనే ప్రోటీన్ బ్రాండ్ కి అంబాసడర్ గా సైన్ చేశాడు. 'తమ్స్ అప్ టేస్ట్ ది థండర్" అంటున్న సూపర్ స్టార్ ఇపుడు "ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ లో - మనం ఆక్టివ్ గా ఉండాలంటే ప్రోటీన్ అవసరం చాలా ఉంది. అందుకే నేను నా డైలీ డైట్ లో సరిపడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. దానికోసం ప్రోటినేక్స్ నాకు దోహద పడుతుంది" అంటున్నాడు మహేష్.
ఇకపోతే ప్రస్తుతం భరత్ అను నేను సినిమాను ఎలాగైనా సరే ఏప్రియల్ 20న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు కష్టపడుతున్నాడు మహేష్. అయితే ఈ మధ్యనే సినిమా సెకండాఫ్ చూసిన సూపర్ స్టార్.. కాసినన్ని సీన్లను మళ్ళీ రీషూట్ చేయాల్సిందిగా దర్శకుడు కొరటాల శివను కోరాడట. ఈ సినిమాలో కొత్త పిల్ల కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.