Begin typing your search above and press return to search.
మహేష్ టైటిల్ 'ఆనందం ఆనందం'
By: Tupaki Desk | 7 April 2015 5:47 AM GMTప్రిన్స్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా టైటిల్ 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం'లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. మరి ఇప్పుడు ఈ 'ఆనందం ఆనందం' ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో తెరకెక్కనుంది? అనే సందేహాలొస్తున్నాయి కదూ!
అయితే ఇది అనువాద చిత్రం. తెలుగు నుంచి తమిళ్‌కి వెళుతున్న చిత్రానికి పెట్టుకున్న టైటిల్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' తమిళంలో రిలీజవుతోంది. అక్కడ టైటిల్ 'ఆనందం ఆనందం'. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన చిత్రమిది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. పైగా అక్కడ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు కూడా చేశారు. మహేష్‌కి తమిళనాడులోనూ మాంచి క్రేజు ఉంది. చెన్నయ్‌లోనే పుట్టి పెరిగాడు. పైగా తమిళం పక్కాగా మాట్లాడగలడు. కాబట్టి ఆ సెంటిమెంటు కొన్నిసార్లు వర్కవుటవుతోంది.
1నేనొక్కడినే చిత్రానికి చెన్నయ్, మధురై, బెంగళూరు లాంటి చోట భారీ వసూళ్లు వచ్చాయి. అదే తీరుగా ఈ చిత్రానికి కూడా తమిళనాడులోని ప్రధాన నగరాల్లో వసూళ్లు బావుంటాయనే అంచనాలు వేస్తున్నారు. కాస్త సమయం వేచి చూడాల్సిందే.