Begin typing your search above and press return to search.

'మ‌హ‌ర్షి' బ‌డ్జెట్ స్కై లో

By:  Tupaki Desk   |   6 Dec 2018 4:24 AM GMT
మ‌హ‌ర్షి బ‌డ్జెట్ స్కై లో
X
` మ‌హ‌ర్షి` బ‌డ్జెట్ అదుపు త‌ప్పుతోందా? వంశీ పైడిప‌ల్లి గ‌త చిత్రం `ఊపిరి` త‌ర‌హా లోనే కాస్ట్ ఫెయిల్యూర్ అవుతోందా? అంటే అవున‌నే గ‌త కొంత‌ కాలంగా రూమ‌ర్లు పుట్టుకొస్తున్నాయి. స్టార్ హీరోల‌కు అయినా 40కోట్లు మించితే అటుపై పెట్టేదంతా కాస్ట్ ఫెయిల్యూర్ కిందే ప‌రిగ‌ణిస్తున్న నేప‌థ్యంలో వంశీ పైడిప‌ల్లి నిర్మాత‌ల‌తో అంత‌కంటే ఎక్కువ పెట్టించ‌డంపై ఫిలిం స‌ర్కిల్స్‌ లో వాడి వేడి చ‌ర్చ సాగుతోంది.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే అమెరికా షెడ్యూల్ అనంత‌రం హైద‌రాబాద్‌కి తిరిగి వ‌చ్చిన చిత్ ర‌బృందం ఇక్క‌డ గ్రామీణ వాతావ‌ర‌ణంలో స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వానికి ఆ షూటింగ్ కోసం ఓ విలేజ్‌కి వెళ్లాల‌ని భావించినా వీలు ప‌డ‌క హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోనే విలేజ్ సెట్‌ని నిర్మించార‌ట‌. దీని కోస‌మే ఏకంగా రూ.10 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. అయితే ఇక్క‌డే ఓ ట్విస్టు. అమెరికాలో చిత్రీక‌రించాల్సిన ఓ పార్టీ సీన్‌ని అక్క‌డ షూట్ చేయ‌డం మ‌ర్చిపోయార‌ట‌. దాంతో హైద‌రాబాద్‌లోనే ఓ గ్రీన్‌మ్యాట్ సెట‌ప్‌తో ఆ సీన్‌ని పూర్తి చేయాల్సి వ‌చ్చిందని చెబుతున్నారు. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బ‌డ్జెట్ అదుపు త‌ప్పుతోంద‌ని నిర్మాత‌లు వ‌ర్రీ అవుతున్నార‌ట‌.

మ‌హ‌ర్షి ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ క‌థ‌తో తెర‌కెక్కుతోంది. స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. స్నేహం కోసం ఎంత‌కైనా తెగించే కుర్రాడిగా మ‌హేష్ క‌నిపించ‌నున్నారు. స్నేహితుడికి ఎదురైన స‌మ‌స్య ప‌రిష్కారం కోసం అమెరికా వెళ్లిన విలేజ్ రైతు క‌థాంశ‌ మిద‌ని కూడా చెబుతున్నారు. స్నేహం విలువ‌ను, ఔన్న‌త్యాన్ని చెబుతూనే కుటుంబ బంధాలు, అనుబంధాలు, రైతాంగం వంటి అంశాల్ని ఇందులో ట‌చ్ చేస్తున్నార‌ట‌. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దిల్‌రాజు - పీవీపీ - అశ్వ‌నిద‌త్ త్ర‌యం ఎక్క‌డా రాజీకి రాకుండా అన్‌లిమిటెడ్ బ‌డ్జెట్‌ని ఈ సినిమాకి వెచ్చిస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది. అయితే ఎంత పెద్ద హిట్టు అని చెప్పుకున్నా `ఊపిరి` కాస్ట్ ఫెయిల్యూర్ అన్న టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అలా జ‌ర‌గ‌కుండా మ‌హేష్ మానియాతో బాక్సాఫీస్‌ మ్యాజిక్ వ‌ర్క‌వుట‌వుతుందేమో చూడాలి.