Begin typing your search above and press return to search.

‘మా’ కోసం మహేష్ బాబు..

By:  Tupaki Desk   |   7 July 2018 8:33 AM GMT
‘మా’ కోసం మహేష్ బాబు..
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత భవనం నిర్మించేందుకు ‘మా’ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల అమెరికాలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. దీని ద్వారా దాదాపు కోటి రూపాయలు సేకరించినట్టు మా అధ్యక్షుడు శివాజీరాజా అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. అమెరికాలో జరిగే ‘మా’ ఈవెంట్ కు హాజరయ్యేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికాలో సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే చిరంజీవిని మించి మహేష్ కలెక్షన్లు రాబడతాడని మా సభ్యులు విశ్వాసంతో ఉన్నారు.

అయితే ఇటీవల బయటపడ్డ సెక్స్ రాకెట్ దృష్ట్యా ఎంతమంది సెలబ్రెటీలు అమెరికాలో జరిగే ఈవెంట్ కు హాజరురవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వేడుకను ‘మా’ స్వయంగా నిర్వహిస్తోంది కనుక.. ఏ యాంకర్ కైనా.. సెలబ్రెటీకైనా ఇబ్బందులు ఉండకపోవచ్చని టాక్. అయితే ఈ వేడుక ఏ ఏ తేదీల్లో నిర్వహిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రెండో విడత సిల్వర్ జూబ్లీ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని నిధుల రూపంలో తీసుకురావాలని మా సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.