Begin typing your search above and press return to search.

సుకుమార్ ని అనాల‌ని కాదు!- మ‌హేష్‌

By:  Tupaki Desk   |   4 May 2019 4:33 PM GMT
సుకుమార్ ని అనాల‌ని కాదు!- మ‌హేష్‌
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - సుకుమార్ కాంబినేష‌న్ మూవీ క్యాన్సిల్ అయ్యాక సీన్‌ గురించి తెలిసిందే. సుక్కూ వినిపించిన స్క్రిప్టును మ‌హేష్ కాద‌నుకోవ‌డంతో ఆ వెంట‌నే సుకుమార్.. అల్లు అర్జున్ తో సినిమాని ప్ర‌క‌టించేశారు. ఏఏ 20 చిత్రానికి సుక్కూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ వెంట‌నే కొద్ది స‌మ‌యంలోనే మ‌హేష్ త‌మ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వ‌డానికి కార‌ణాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. సుకుమార్ తో క‌థ విష‌యంలో కుద‌ర‌లేద‌ని తెలిపారు. అలానే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా ఉంటుంద‌ని రివీల్ చేశారు. మ‌హేష్‌- సుకుమార్ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు మైత్రి సంస్థ ప్ర‌య‌త్నించింది.

అదంతా ఒకెత్తు అనుకుంటే మొన్న `మ‌హ‌ర్షి` ప్రిరిలీజ్ ఈవెంట్ లో మ‌హేష్ చేసిన ఓ వ్యాఖ్య గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ``ఈరోజుల్లో రెండు నెలలు కూడా ఎవరూ వెయిట్ చేయరు`` అని అన‌డంతో అది సుకుమార్ ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్య అంటూ మీడియా హైలైట్ చేసింది. అయితే ఇదే విష‌యాన్ని మ‌హేష్ వ‌ద్ద ప్ర‌స్థావిస్తే.. అస‌లు త‌న‌ని అనాల‌నే ఉద్ధేశం త‌న‌కు ఎంత‌మాత్రం లేద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ``దర్శకుడు వంశీ నాకోసం రెండేళ్లు వెయిట్ చేశారు. ఈరోజుల్లో రెండు నెలలు కూడా ఎవరూ వెయిట్ చేయర``ని అన్నాను. అక్కడ నేను వంశీని పొగిడాను కానీ.. సుకుమార్‌ గారిని అనాల‌నే ఉద్ధేశం లేదు.. అని వివ‌ర‌ణ ఇచ్చారు. కొంత మంది నేను సుకుమార్‌ని అన్నట్టుగా రాశారు. సుకుమార్ ఒక దర్శకుడిగానే కాదు.. ఒక మంచి స్నేహితుడు కూడా. అందులో సందేహాలేం లేదు. త్వరలో ఆయనతో కలిసి పనిచేస్తాన‌ని మ‌హేష్ తెలిపారు.

సుకుమార్‌ క‌థ విష‌యంలో అస‌లేం జ‌రిగింది? అన్న ప్ర‌శ్న‌కు.. సుకుమార్ నేను సినిమా చేయాలని అనుకున్నాం. వ‌రుస‌గా సామాజిక సందేశాలిచ్చే సినిమాలే అవుతున్నాయి. ఇవ‌న్నీ ఇంటెన్స్ ప్రాజెక్టులు.... ఇలాంటి స‌మ‌యంలో `దూకుడు` లాంటి స్క్రిప్ట్ స‌రైన‌ది అనిపించింద‌ని మ‌హేష్ తెలిపారు. నాకున్న కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి నేనూ చేయాలి క‌దా అనీ అన్నారు. ఆ విష‌యాన్నే సుకుమార్‌ గారితో చెబితే.. ఆయన ఒక సినిమా చేసుకుని వ‌స్తాన‌న్నారు. నేనూ ఈ సినిమా చేసుకుని వ‌స్తాన‌ని చెప్పాను అంటూ సుదీర్ఘ వివ‌ర‌ణ‌ ఇచ్చారు. ఈ వివ‌ర‌ణ‌తో ఇక‌నైనా మ‌హేష్ - సుక్కూ డిఫ‌రెన్సెస్ గురించిన‌ స్పెక్యులేష‌న్స్ ఆపేయాల్సిందేనేమో!!