Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : పిల్లలతో పిల్లాడయిన మహేష్
By: Tupaki Desk | 11 Oct 2021 3:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో పెద్ద స్టార్.. సూపర్ స్టార్ అయినా కూడా నిజ జీవితంలో ఆయన పిల్లల వద్ద మాత్రం చాలా జోవియల్ గా చాలా కూల్ గా వారికి తగ్గట్లుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. పిల్లలతో చాలా కలిసి పోయి వారితో రెగ్యులర్ గా ఆటలు ఆడుతూ.. హాలీడేస్ కు వెళ్తూ అందరితో కలిసి పోయి ఉంటాడు. అన్ని విధాలుగా మహేష్ బాబు తన పిల్లలకు పూర్తి క్వాలిటీ టైమ్ ను కేటాయిస్తాను అంటూ ఉంటాడు. అన్నట్లుగానే ఏడాదిలో ఒకటి రెండు సార్లు స్పెషల్ ట్రిప్ ను ప్లాన్ చేసి అక్కడ షూటింగ్ లు ఇతర విషయాలు అన్ని కూడా పక్కన పెట్టి పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం హాలీడేస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా మహేష్ బాబు పాప సితార మరియు గౌతమ్ తో స్విమ్ చేస్తూ సరదాగా సమయంను గడుపుతున్న ఫొటోను షేర్ చేయడం జరిగింది. స్ర్పింగ్ సీజన్ లో వాటర్ లో ఇలా ఎంజాయ్ చేయడం అది కూడా నా ఇద్దరు పిల్లలతో చాలా ఆనందంగా ఉందటూ కామెంట్ పెట్టాడు. మహేష్ బాబు తన పాప మరియు బాబుతో ఈ ఫొటోలో ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. ఇదే చోట నమ్రత కూడా ఉన్నారు. నమత్ర మరియు కుటుంబ సభ్యులు అంతా కూడా విదేశీ టూర్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత మరియు సితారలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటో పెడుతున్నారు. కాని మహేష్ బాబు మాత్రం చాలా అరుదుగా ఇలాంటి పొటోలు షేర్ చేస్తాడు. తనకు చాలా ఇష్టం కనుక షేర్ చేశాడు అనిపిస్తుంది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చేయడం జరిగింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవినీతితో పాటు ఒక మంచి కమర్షియల్ పాయింట్ తో సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు సాధించి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.