Begin typing your search above and press return to search.

నైట్ పార్టీలో మ‌హేష్ చిలౌట్.. వ‌య‌సెంతో గెస్ చేశారా?

By:  Tupaki Desk   |   6 Jun 2023 10:00 AM GMT
నైట్ పార్టీలో మ‌హేష్ చిలౌట్.. వ‌య‌సెంతో గెస్ చేశారా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు వ‌య‌సు ఎంత‌? ఈ ప్ర‌శ్న‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం చెప్పేయ‌డం అంత సులువేమీ కాదు. అత‌డి శ‌రీర‌భాష.. స్ట్ర‌క్చ‌ర్ .. ఎంపిక చేసుకున్న హెయిర్ స్టైల్ .. ఓవ‌రాల్ లుక్ చూస్తే ఇంకా పాతిక ప్రాయంలోనే ఉన్నాడా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. గాళ్స్ అయితే ఇప్ప‌టికింకా మ‌హేష్ వ‌య‌సు నిండా ప‌ద‌హారే! అంటూ అమీర్ పేట‌ హాస్ట‌ల్ గోడ‌ల‌పై పోస్ట‌ర్ల‌ను అతికించి ఆరాధిస్తూనే ఉన్నారు.

మ‌హేష్ ఇంత ఇస్మార్ట్ లుక్ ని ఎలా మెయింటెయిన్ చేయ‌గ‌లుగుతున్నాడు? అన్న‌ది ఒక ఫ‌జిల్. ఇప్పుడు అత‌డి వ‌య‌సును గుర్తు చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ సెంచ‌రీ కొట్టేస్తున్నాడ‌ని గుర్తు చేయ‌డం అన‌వ‌స‌రం. అత‌డిలో ఉత్సాహం ఎన‌ర్జీ చిరున‌వ్వు ఎప్పుడూ వ‌య‌సును దాచేస్తూనే ఉన్నాయి.

అంతెందుకు నిన్న‌టి రేయి త‌మ కుటుంబ స్నేహితుల‌తో క‌లిసి నైట్ పార్టీలో మెరిసిన మ‌హేష్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ కాగానే.. ఇంత‌కీ ఎవ‌రీ ఇస్మార్ట్ కుర్రాడు? అంటూ గాళ్స్ అంతా సందేహం వ్య‌క్తం చేసారు.

నిన్న రాత్రి శ్రీయా భూపాల్ -అనిందిత్ రెడ్డిల బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు -నమ్రత హాజరయ్యారు. మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గూఫీ ఫోటోల బంచ్ ని షేర్ చేసాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మ‌హేష్ - న‌మ్ర‌త‌ సరదా ప‌రాచికాలు ఈ ఫోటోల్లో హైలైట్ అయ్యాయి.

అంత‌కుమించి మ‌హేష్ యూత్ ఫుల్ లుక్ పార్టీలో కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారింద‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి. 'వాట్ ఎ ఫన్ నైట్... @ శ్రియభూపాల్ మరియు @ అనిందిత్ !!'' ఇది నిజంగా సరదా రాత్రి'' అంటూ ఈ ఫోటోల బంచ్ కి క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

శ్రీ‌యాభూపాల్ ప్ర‌ముఖ బిజినెస్ టైకూన్ జీవీకే రెడ్డి కుమార్తె. జీవీకే గ్రూప్స్ సంస్థానానికి వార‌సురాలు. ఫ్యాష‌న్ స్టూడెంట్ అయిన శ్రీ‌యకు ప్ర‌ముఖ బాలీవుడ్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హ‌లానియా గురూజీ. ఇంత‌కుముందు అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థం అనంత‌రం బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే.