Begin typing your search above and press return to search.
మహేష్.. నాగ్.. అంతా ఇక్కడే
By: Tupaki Desk | 9 Jan 2018 11:30 PM GMTఒక సినిమాను తెరకెక్కించాలంటే లొకేషన్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో ఒక సిన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే ఆ లొకేషన్స్ పాత్ర కూడా చాలానే ఉంటుంది. అయితే ఇటీవల మన తెలుగు తారలు ఎక్కువగా లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు దర్శకులు సెట్స్ తో మ్యానేజ్ చేస్తుంటే మరికొందరు ఏకంగా నిజమైన ప్రదేశాలలో సినిమాను భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు.
ఒక యాక్షన్ పరమైన సన్నివేశాలను చిత్రీకరించాలంటే ఎక్కువగా సెట్స్ లలో అయితేనే బెటర్ అని మన దర్శకులు అందుకు తగ్గ లొకేషన్స్ సెట్స్ చేసుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం చాలా వరకు ఎక్కువగా హైదరాబాద్ లోనే షూటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని రియల్ ప్లేసెస్ లలో ఎలాంటి మార్పులు చేయకుండా దర్శకులు షూటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతోంది. సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే రియాలిటీ ఎక్కువగా కనిపించాలని దర్శకుడు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడట.
ఇక నాగార్జున - రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ లోనే నడుస్తోంది. గచ్చిబౌలి లోని కొన్ని ప్రదేశాల్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాక్షన్ పరమైన సన్నివేశాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగ్ తనయుడు నాగ చైతన్య కూడా నగరంలోనే సవ్యాసాచి షూటింగ్ ని కొనసాగిస్తున్నాడు. ఉప్పల్ లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. చందు మొండేటి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.