Begin typing your search above and press return to search.

ప్చ్.. 'బజార్'లో పీడికా పదుకొనె

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:41 AM IST
ప్చ్.. బజార్లో పీడికా పదుకొనె
X
ప్రపంచంలో అత్యంత భారీగా సంపాదించేస్తున్న సినిమా భామల లిస్ట్ ని.. రీసెంట్ గా ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. సాధారణంగా ఈ లిస్ట్ ని ఇండియన్స్ పెద్దగా పట్టించుకోరు కానీ.. ఈ సారి టాప్ 10లో దీపికా పదుకొనేకి ప్లేస్ లభించడంతో.. ఈ జాబితా హాట్ టాపిక్ అయిపోయింది. అన్ని మేగజైన్స్ ఈ లిస్ట్ ని ప్రముఖంగా ప్రచురించేశాయి. అయితే.. ఫ్యాషన్ మేగజైన్ హార్పర్స్ బజార్ కి మాత్రం.. రీడర్స్ నుంచి నెటిజన్స్ నుంచి ట్రాలింగ్ ఎదురైంది.

ప్రపంచవ్యాప్తంగా రీడర్స్ ఉన్న ప్రముఖ మేగజైన్ హార్పర్స్ బజార్.. న్యూయార్క్ బేస్డ్ గా నడుస్తోంది. వీళ్లు ప్రచురించిన టాప్ పెయిడ్ యాక్ట్రెస్ లిస్ట్ లో దీపికా పదుకొనే పేరు స్పెల్లింగ్ ను తప్పుగా రాశారు. దీపికా పదుకొనేకు బదులు పీడికా పదుకొనే (Peedika Padukone) అని లిస్ట్ లో కనిపిస్తుంది. ఇది టైపింగ్ మిస్టేక్ అయుండచ్చు కానీ.. ప్రపంచం అంతా గుర్తించిన ఓ పేరును.. హాలీవుడ్ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్న దీపిక నేమ్ స్పెల్లింగ్ ను.. అంతటి ప్రముఖమైన పత్రిక రాంగ్ స్పెల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

ఈ మేగజైన్ ఈ తప్పు చేసి దొరకగానే.. 'ఎక్కువగా ప్రియాంక గురించి రాసీ రాసీ.. వీళ్లు పీడికా పదుకునే అంటున్నారు' అనీ.. 'హాలీవుడ్ లో దీపికను పీడికా అంటున్నారు' అనీ.. జనాలు రకరకాలు ట్వీట్లు మొదలుపెట్టేశారు. హార్పర్స్ బజార్ ని.. బజార్ లో పెట్టి కడిగేస్తున్నారు. తప్పు చిన్నదే అయినా.. నెటిజన్స్ ఎంటి ఎలర్ట్ గా ఉన్నారో.. తప్పు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనేందుకు.. పీడికా పదుకొనే బెస్ట్ ఎగ్జాంపుల్.