Begin typing your search above and press return to search.
హాలీవుడ్ మూవీని తలపించే పీతల వీడియో ఇది
By: Tupaki Desk | 19 Jun 2016 4:00 AM ISTహాలీవుడ్ సినిమాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఊహాకు అందని కాన్సెప్ట్ లతో తీసే సినిమాల్ని చూసినప్పుడు నోట వెంట మాట రాదు. అలాంటి ఫీల్ కలిగించే రియల్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. పీతలకు సంబంధించి సరికొత్త విషయాలు తెలిసేలా ఉన్న ఈ వీడియోను చూసే వారికి భయం.. విస్మయం.. గగుర్పాటు లాంటివెన్నో ఒక్కసారి చుట్టుముట్టటం ఖాయం.
పీతలకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న అంచనాలకు భిన్నంగా ఈ రియల్ వీడియో ఉండటం గమనార్హం. ఒకేసారి పెట్టిన గుడ్లతో పుట్టే పీతలు.. పెరిగే కొద్దీ తమ తోటి పీతల్ని చూసి భరించలేవు. ఆహారం దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ పోటీ పడే పీతల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయా? అన్న సందేహం కలిగేలా తాజా వీడియో బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన సముద్ర శాస్త్రవేత్త షెరీ మారిస్ మెల్ బోర్న్ లోని ఫిలిప్ బే సముద్ర గర్భంలో ఒక వీడియో తీశారు.
ఒక భారీ రాకాసి పీత ఒకటి ముందుకు నడుస్తుంటే.. దాని వెనుక.. వేలాది పీతలు క్రమశిక్షణతో ఒక జట్టులా దూసుకురావటాన్ని చూసినప్పుడు.. అదేదో గ్రాఫిక్ మాయాజాలం అన్న భావన కలుగుతుందే తప్పించి నిజమనిపించదు. అంతగా విస్మయానికి గురి చేసే పీతల వీడియో చూసినప్పుడు.. ఆహారం కోసం పోటీ పడే కన్నా.. కలిసికట్టుగా.. ఐకమత్యంగా పోరాడితే భారీ లాభం సొంతం అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయా? అన్న భావనకు గురి కావటం ఖాయం. ఈ బుజ్జి వీడియోను మన రాజమౌళి లాంటి వారు చూస్తే సముద్రంలో పీతలతో ఫైటింగ్ సీన్ పెట్టేందుకు పక్కా ముడిసరుకుగా మారటం ఖాయం. కావాలంటే.. మీరూ ఈ వీడియోను ఒక లుక్కేయండి..?