Begin typing your search above and press return to search.

బికినీ బేబీ బట్టలేసినా బ్యూటిఫుల్లే

By:  Tupaki Desk   |   13 Nov 2015 9:30 AM GMT
బికినీ బేబీ బట్టలేసినా బ్యూటిఫుల్లే
X
బాలీవుడ్ లో బెస్ట్ బికినీ బాడీ ఎవరికి ఉందయ్యా అంటే.. అమీ జాక్సన్ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ భామ రీసెంట్ గా సింగ్ ఈజ్ బ్లింగ్ లో వేసుకున్న పింక్ బికినీ ఓ సెన్సేషన్. కుర్రకారుకు మత్తెక్కించి మతులు పోగొట్టే రేంజ్ లో బికినీ వేయడం అమీకే చెల్లింది. ఇంతలేసి అందాలు ఆరబోసే ఈ బ్రిటిష్ మోడల్ కం యాక్టర్ ఈ మధ్య ఫుల్లుగా బట్టలేసుకుని ఓ మ్యాగజైన్ కి ఫోటోలకు ఫోజులిచ్చింది.

అప్పటివరకూ చిట్టి పొట్టి డ్రస్సుల్లో అందాలు చూసిన ఆడియన్స్ కు.. ఒక్కసారిగా ఫుల్ డ్రస్ లో చూసేసరికి మైండ్ బ్లాంక్ అయింది. అంటే ఇలా ఫుల్లుగా కప్పుకుని ఎప్పుడూ కనపడలేదని కాదు.. ఇంత అందంగా కనిపించలేదని అర్ధం. బికినీ లో బోల్డ్ గానే కాదు.. పూర్తిగా కప్పేసుకుని కంటికి ఇంపుగా కనిపించగలలని ప్రూవ్ చేసింది. బ్రిటన్ ఇంపోర్ట్ అయిన అమీ జాక్సన్.. 2012నుంచి ఇండియన్ మూవీస్ లోనే సందడి చేసోంది.

మొదట మదరాసీ పట్టణంతో తమిళ్ చిత్రంతో ఇండియాలో ఎంటర్ అయిన ఈ ఫారిన్ పాప.. టాలీవుడ్ లో రామ్ చరణ్ సరసన ఎవడు చిత్రంలో చేసింది. లేటెస్ట్ గా సింగ్ ఈజ్ బ్లింగ్ లో అదరగొట్టినా.. అమ్మడి కెరీర్ లో అత్యంత భారీ చిత్రం మాత్రం శంకర్ ఐ మూవీనే. ప్రస్తుతం చేతిలో తమిళ్ చిత్రాలు మూడున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ మూవీస్ కావడం, అందులో ఒకటి విజయ్ సరసన చేస్తుండడం విశేషం.