Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అమీ 2.0ను చూడచ్చు

By:  Tupaki Desk   |   4 Jun 2017 5:51 AM GMT
ఫోటో స్టోరీ: అమీ 2.0ను చూడచ్చు
X
బ్రిటన్ అందం అమీ జాక్సన్.. ఇండియన్ గ్లామర్ లవర్స్ ను కరుణించి ఇక్కడే తెగ సినిమాలు చేసేస్తోంది. కౌంట్ విషయంలో తక్కువగా ఉన్నా మంచి సినిమాలతోనే ఆకట్టుకుంటూ ఉంటుంది. సబ్జెక్ట్ సెలక్షన్ విషయంలో ఈ భామ ట్యాలెంట్ చూసి చాలామంది హీరోయిన్స్ షాక్ అవుతుంటారు కూడా. టాలీవుడ్ లో ఎవడు అంటూ రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఈ భామ.. ప్రస్తుతం రజినీతో కలిసి 2.0లో నటిస్తుండగా.. శంకర్ దర్శకత్వంలో వరుసగా ఇది రెండో చిత్రం కాడం విశేషం.

షూటింగ్ సంగతేమో కానీ.. ఫోటో షూట్స్ విషయంలో అమీ జాక్సన్ ను ఆపడం చాలా కష్టం. బక్కగా కనిపించినా బోలెడన్ని అందాలను తనలో దాచుకున్న ఈ బ్యూటీ.. తనది పర్ఫెక్ట్ బికినీ బాడీ అని గర్వంగా చెప్పుకుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను ఫ్యాన్స్ కు చూపించే అమీ.. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంటోంది. అలా అన్నంత మాత్రాన ఎక్కడికో వెళ్లిపోవాల్సిన పని లేదు. జస్ట్ ఓ వారం రోజుల వెనుక తను చేసిన ఓ ఫోటో షూట్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అమీ. సింగిల్ పీస్ బికినీ మోడల్ డ్రెస్ లో అమ్మడు అందాలు దాగలేక బోలెడంత ఇబ్బంది పడిపోతుంటే.. వాటిని మరింతగా ఇబ్బంది పెట్టలేనని చెబుతున్నట్లుగా ఉంది మీ వాలకం..

ఓ రెయిలింగ్ మీద కూర్చుని మెడ ఓ యాంగిల్ లో వంచి.. ఓరగా చూస్తున్న అమీ జాక్సన్ ఫోటో సూపర్బ్ గా ఉంది. మొనాకోలో తీసిన ఈ ఫోటో షూట్ ఈమెకు విపరీతంగా నచ్చేసిందట. అక్కడి నుంచి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చానంటోంది అమీ జాక్సన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/