Begin typing your search above and press return to search.

అభిమానుల‌కు అల్లు అర‌వింద్ ప్రేమ లేఖ‌! ‘ఆహా..’

By:  Tupaki Desk   |   9 Feb 2021 9:30 AM GMT
అభిమానుల‌కు అల్లు అర‌వింద్ ప్రేమ లేఖ‌! ‘ఆహా..’
X
తెలుగు ఓటీటీ ‘ఆహా’.. త‌న‌ ప్ర‌యాణం మొద‌లు పెట్టి ఫిబ్ర‌వ‌రి 8వ తేదీకి ఏడాది పూర్త‌యింది. అన‌తి కాలంలోనే ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొంది. ఎంతో కాలంగా కొన‌సాగుతున్న ఓటీటీల‌తో స‌మానంగా కంటెంట్ ను ఆడియ‌న్స్ కు అందుబాటులో ఉంచుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ యానివ‌ర్సరీ పూర్తిచేసుకుంది.

ఈ సంద‌ర్భంగా ఫౌండ‌ర్‌ అల్లు అర‌వింద్ ‘ఆహా’ స‌బ్ స్క్ర‌యిబర్స్‌, అభిమానుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ఈ ప్ర‌యాణంలో త‌మ‌కు తోడుగా నిలిచిన వారికీ, స‌హ‌క‌రించిన వారంద‌రికీ కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇంకా ఆ లేఖ‌లో ఏం రాశారంటే...

‘‘ప్రియ‌మైన కుటుంబ స‌భ్యుల‌కు,

అలా ఎందుకు అంటున్నాను అంటే.. ఈ రోజు ‘ఆహా’ అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు సంతోషంగానూ, గ‌ర్వంగానూ ఉంది. మీ ప్రేమ ఆద‌ర‌ణ వ‌ల్ల ఈ రోజు ‘ఆహా’ మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటున్న‌ది. ఈ ‘ఆహా’ కుటుంబంలో మ‌న‌మంద‌రమూ స‌భ్యుల‌మే క‌దా!

వినోదం అంటే మ‌న‌కు ఇష్టం - తెలుగు అంటే ఇంకా ఇష్టం. రెండూ క‌లిసిన ఈ ‘ఆహా’ను విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న మీకు మేము ఎంత‌యినా కృత‌జ్ఞులం.

శ్రీ జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు గార‌రికి, రాము గారికి, మాతోత క‌లిసి న‌డిచే మా భాగ‌స్వాములంద‌రికీ, ఇంత వేగంగా దీనిని తీసుకు రావ‌డానికి నిర్విరామంగా ప‌నిచేసిన మా సిబ్బంది అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు

ప్రేమ‌తో
అల్లు అర‌వింద్‌’’
అంటూ లేఖను ముగించారు మెగా ప్రొడ్యూసర్.