Begin typing your search above and press return to search.

బ‌న్ని సౌత్ ఇండియా స్టార్ అదెట్టా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 6:30 PM GMT
బ‌న్ని సౌత్ ఇండియా స్టార్ అదెట్టా?
X
సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్స్ అన‌గా గుర్తొచ్చే పేర్లు రెండు మాత్ర‌మే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మాత్ర‌మే. ఈ ఇద్ద‌రి సినిమాలు మాత్ర‌మే ద‌శాబ్ధాలుగా సౌత్ అంత‌టా రిలీజ‌వుతున్నాయి. త‌మిళ్- తెలుగు- క‌న్న‌డ‌- మ‌ల‌యాళ భాష‌ల్లో మైలేజ్ ఉన్న హీరోలుగా ఏలారు ఆ ఇద్ద‌రూ. రిలీజ్ స‌మ‌యంలో ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి అభిమానుల‌కు చేరువగా ప్ర‌చారం చేస్తుంటారు. ఇంకా అజిత్... విజ‌య్..సూర్య‌...ధ‌నుష్ ఇంకొంత మంది స్టార్ల సినిమాలు సౌత్ లో కొన్ని భాష‌ల్లో రిలీజ్ అవుతుంటాయి. ఈ న‌లుగురు హీరోల‌లో సూర్య‌..ధ‌నుష్‌...కార్తీ మాత్ర‌మే ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ వ‌చ్చి త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకుంటారు. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. న‌టించిన సినిమాలు అప్ప‌ట్లో ఇరుగు పొరుగు భాష‌ల్లో రిలీజ‌య్యాయి. సైరా-న‌ర‌సింహారెడ్డిని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేశారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక‌పై ప్ర‌భాస్ సినిమాల‌న్నీ ఇత‌ర భాష‌ల్లోనూ రిలీజ‌వుతూనే ఉంటాయి.

ఇత‌ర స్టార్ హీరోల్లో అల్లు అర్జున్.. మ‌హేష్ .. చ‌ర‌ణ్ .. మ‌హేష్ ల‌కు ఇరుగు పొరుగున‌ క్రేజ్ పెరుగుతోంది. దీంతో రెగ్యుల‌ర్ గా వీళ్ల‌ సినిమాలు పొరుగు భాష‌ల్లో రిలీజ్ అవుతుంటాయి. త‌మిళ్ మార్కెట్ పై మెగాస్టార్ చిరంజీవి స‌హా ఇత‌ర స్టార్ హీరోలు క‌న్నేసినా ఎందుక‌నో తంబీలు మ‌న తెలుగు హీరోల్ని స‌క్సెస్ కానివ్వ‌రు అక్క‌డ‌. ఈ నేప‌థ్యంలో తెలుగు హీరోల‌లో ఏ ఒక్క‌ర్నీ సౌత్ ఇండియ‌న్ స్టార్ అని ప‌రిపూర్ణంగా పిల‌వ‌లేని స‌న్నివేశం ఉంది. మెగాస్టార్...సూప‌ర్ స్టార్...ప‌వ‌ర్ స్టార్....అని పిలుచుకుంటాం త‌ప్ప సౌత్ స్టార్ అని సంబోధించ‌డం చాలా రేర్ గా మాత్ర‌మే జ‌రుగుతుంటుంది.

అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియా స్టార్ అంటూ ప్ర‌మోట్ చేసుకోవ‌డం అంత‌టా చ‌ర్చ‌కు తెర‌ తీసింది. ఇటీవ‌లే బ‌న్నీ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో భారీ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో సౌత్ ఇండియ‌న్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఊద‌ర‌గొట్టేస్తున్నారు. దీంతో బ‌న్నీ యాంటీ వ‌ర్గం ఇదెట్టా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. తెలుగు- మ‌ల‌యాళంలో మాత్ర‌మే బ‌న్నీ సినిమాలు రిలీజ్ అవుతాయి. హైద‌రాబాద్ లో త‌ప్ప బ‌న్నీ వేరే ఎక్క‌డా త‌న సినిమాను ప్ర‌మోట్ చేయ‌డు. అలాంట‌ప్పుడు అత‌న్ని ఆల్ సౌతిండియా స్టార్ ఎలా అంటాం. త‌మిళ్ హీరోలు సూర్య‌.. కార్తీ..ధ‌నుష్ తెలుగులో త‌మ సినిమాలను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌మోట్ చేసుకుంటారు. రిలీజ్ కు ముందు అలాగే అవ‌స‌ర‌మైతే రిలీజ్ త‌ర్వాత బూస్ట్ ఇచ్చుకునే ప్రయ‌త్నం చేస్తారు. కానీ బన్ని అలాంటి ప్ర‌య‌త్నాలే చేయ‌కుండా సౌత్ ఇండియన్ స్టార్ అని ప్ర‌క‌టించుకోవ‌డంపై ఒక సెక్ష‌న్ సీరియ‌స్ గానే కామెంట్లు చేస్తున్నారు.