Begin typing your search above and press return to search.
ఉగ్రం క్లైమాక్స్ సీన్.. అన్ని రోజులు కష్టపడ్డారా..?
By: Tupaki Desk | 1 May 2023 8:00 AM GMTనాంది నుంచి తన స్టైల్ మార్చేసిన అల్లరి నరేష్ త్వరలో ఉగ్రం సినిమాతో రాబోతున్నాడు. ఉగ్రం సినిమా విషయంలో నరేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న ఈ ఉగ్రం సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. నాంది కన్నా ఉగ్రం తో నరేష్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలతో ఉగ్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది. ఈ సినిమా కోసం అల్లరోడు బాగానే కష్టపడినట్టు అనిపిస్తుంది.
సినిమా కోసం సిగరెట్స్ కూడా బాగా తాగేశాడట. నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగానని దాని వల్ల తన ఆరోగ్యం కూడా పాడైందని చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే ఉగ్రం సినిమా క్లైమాక్స్ కోసం దాదాపు 15 రోజుల పాటు నైట్ షూట్ చేశారట. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా స్పెషల్ అందుకే సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం విజయ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడని చెప్పాడు. విజయ్ ఫ్యూచర్ లో తప్పకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడని అతనికి తాను ఎంచుకున్న కథ మీద మంచి క్లారిటీ ఉంటుందని అన్నారు.
తప్పకుండా విజయ్ పెద్ద దర్శకుడు అవుతాడని అన్నారు. అల్లరి నరేష్ ఉగ్రం కోసం బాగా కష్టపడినట్టు అర్థమవుతుంది. మరి ఈ సినిమా నాందిని మించే హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన అల్లరి నరేష్ వరుసగా ఫ్లాపులు పలకరించడంతో తన రూటు మార్చేశాడు. మహర్షి సినిమాలో రవి పాత్ర సీరియస్ గా చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే నాంది సినిమాకు నాంది పలికిందని అన్నారు.
ఇక నాంది చేసే టైం లోనే ఆ సినిమా సక్సెస్ అయితే విజయ్ తో మరో సినిమా చేయాలని అనుకున్నా ఆ క్రమంలోనే ఉగ్రం చేశామని అన్నారు. విజయ్ మేకింగ్.. సినిమాపై అతనికి ఉన్న ప్యాషన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మే 5న ఉగ్రం రిలీజ్ అవుతుండగా ఈ సినిమాకు పోటీగా గోపీచంద్ రామబాణం సినిమా కూడా రిలీజ్ అవుతుంది.