Begin typing your search above and press return to search.
రెండేళ్ళలో రాజా డైరక్షన్ చేస్తాడట
By: Tupaki Desk | 10 July 2016 4:20 AM GMTఅసలు అల్లరోడు ఆవేశంగా హీరోగా అడుగుపెట్టేశాడు కాని.. నిజానికి మనోడు డైరక్టర్ అవ్వాలని నాన్నాగారు ఈ.వి.వి.సత్యనారాయణ గారు చాలా ఆశ పడ్డారట. కాకపోతే మనోడు మాత్రం రవిబాబు డైరక్షన్ లో ''అల్లరి'' సినిమాతో ఎంట్రీ ఇచ్చాక.. హీరోగా టక్ మని స్థిరపడ్డాడు. దానికితోడు పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హీరోగా స్ర్టగుల్ అవుతుండటంతో.. ఇక ఈవివి కూడా చిన్న కొడుకును యాక్టింగ్ వైపే ఎంకరేజ్ చేశారు.
కాని డాడి కోరిక మాత్రం తీరుస్తాను అంటున్నాడు అల్లరి నరేష్. ''మరో రెండేళ్ళలో నా డైరెక్షన్ లో ఓ చిత్రాన్ని తీయడానికి ఇప్పటి నుంచే కథను తయారు చేస్తున్నాం. నన్ను దర్శకుడుగా నాన్న చూడాలనుకున్నారు. అయితే యాదృచ్ఛికంగా హీరో అయ్యాను. దీంతో ఆయన కలను నెరవేరలేదు. ఇప్పుడు ఆయన కలను నెరవేర్చడానికి మెగా ఫోన్ పట్టుకునేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
ఆల్రెడీ 50 సినిమాల్లో నటించాడు కాబట్టి.. దర్శకత్వం చేయడం పెద్ద విషయమేం కాదు. ఇప్పటికే అన్ని ట్రేడ్ల పట్ల సరైన అవగాహన వచ్చేసే ఉంటుంది. కాబట్టి నరేష్ డైరక్షన్ లో మాంచి సినిమానే వచ్చే ఛాన్సుంది. పైగా ఈ సినిమా ఈవివి సినిమా బ్యానర్ పై సొంత మూవీగా తీస్తున్నాడట.