Begin typing your search above and press return to search.

పాములంటే భయం.. అల్లరోడికి సూపర్ హిట్‌ మిస్‌

By:  Tupaki Desk   |   13 May 2023 3:00 PM GMT
పాములంటే భయం.. అల్లరోడికి సూపర్ హిట్‌ మిస్‌
X
ఇండస్ట్రీలో చాలా సార్లు పలు సందర్భాల్లో ఈ కథ ఆ హీరో వద్దకు వెళ్లింది.. ఈ కథ మొదట ఈ హీరో వద్దకు వచ్చింది అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ అయినా లేదంటే అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆ చర్చ ప్రధానంగా సాగుతుంది. హిట్ సినిమా మిస్ అయిన హీరో అని... లేదా ఫ్లాప్ ని తప్పించుకున్న హీరో అంటూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

ఒక హీరో తమ వద్దకు వచ్చిన కథలకు నో చెప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కథలు మరో హీరో చేసి సూపర్ హిట్‌ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కథ నచ్చక నో చెప్పగా ఇతర హీరోల వద్దకు వెళ్లి సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉంటాయి.

అల్లరి నరేష్ మాత్రం ఒక కథ నచ్చి కూడా నో చెప్పాడు. అందుకు కారణం ఆ సినిమా కథ నేపథ్యం ఒక పాము అవ్వడమే. ఆయనకు వ్యక్తిగతంగా పాము అంటే చాలా భయం.. ఆ భయం కారణంగానే ఒక సూపర్ హిట్ సినిమాకు నో చెప్పాడట. తాజాగా ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా అల్లరోడు అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

నరేష్ నో చెప్పిన ఆ సినిమా 'కార్తికేయ'. దర్శకుడు చందు మొండేటి మొదట ఆ కథను అల్లరి నరేష్‌ కు చెప్పాడట. కథ లో పాములు ఉండటం తో బాబోయ్ నా వల్ల కాదు అంటూ నరేష్ నో చెప్పాడట. ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా కూడా నో అన్నాడట.

అదే కథతో యంగ్‌ హీరో నిఖిల్‌ తో చందు మొండేటి 'కార్తికేయ' సినిమాను రూపొందించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా దాదాపుగా 25 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక తాజాగా వచ్చిన కార్తికేయ 2 సినిమా మరింత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ 2 సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

అల్లరి నరేష్ కి కూడా కార్తికేయ సినిమా కథ సరిగ్గా సెట్‌ అయ్యేది ఆ సినిమా ను ఆయన చేసి ఉంటే బాగుండేది అంటూ ఇప్పటికి కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ కెరీర్ లో ఇప్పటికి ఎప్పటికి కార్తికేయ మరియు కార్తికేయ 2 సినిమాలు చాలా స్పెషల్ గా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు.