Begin typing your search above and press return to search.

అల్ల‌రోడి కంబ్యాక్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   24 Sep 2019 6:03 AM GMT
అల్ల‌రోడి కంబ్యాక్ ఎప్పుడు?
X
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా మారుతి తెర‌కెక్కించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` ఎంతటి క్లాసిక్ హిట్లో తెలిసిందే. ఈ సినిమా నానీ కెరీర్ కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. కొన్ని ఫ్లాపుల త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. అలాగే మారుతి కెరీర్ కి ఈ చిత్రం అంతే పెద్ద ప్ల‌స్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడి మొద‌టి ఆప్ష‌న్ నానీ కాద‌ని అల్ల‌రి న‌రేష్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. న‌రేష్ ఆ చిత్రంలో న‌టించి ఉంటే కెరీర్ వేరేగా ఉండేది అంటూ క‌థ‌నాలు వండి వారుస్తున్నాయి కొన్ని యూట్యూబ్ చానెళ్లు.

అయితే ఇది నిజ‌మా? భ‌లే భ‌లే మ‌గాడివోయ్ తొలి ఆప్ష‌న్ అల్ల‌రోడేనా? .. ఈ ప్ర‌శ్న ఆయ‌న్నే అడిగేస్తే .. అవ‌న్నీ వ‌ట్టి రూమ‌ర్లు అని ఖండించారు. మారుతి నాకు చెప్పిన క‌థ వేరొక‌టి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ క‌థ‌ను నాకు చెప్ప‌లేదు. ఒక‌వేళ చెప్పి ఉంటే వెంట‌నే అంగీక‌రించేవాడిని అని న‌రేష్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మొత్తానికి ఈ వివ‌ర‌ణ‌తో అభిమానుల‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.

న‌రేష్ కెరీర్ జ‌ర్నీ గురించి సంగతి తెలిసిందే. ఇటీవలే సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌టించారు. ఆ సినిమా త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అయితే న‌రేష్ కి సోలో హీరోగా కంబ్యాక్ సినిమా ఎప్పుడొస్తుంది.. ఒడిదుడుకుల నుంచి బ‌య‌ట‌పడేది ఎప్పుడు అన్నది అభిమానుల్లో చ‌ర్చ‌. టాలీవుడ్ లో అత్యంత వేగంగా 50 సినిమాల్లో న‌టించిన ప్ర‌తిభావంతుడు న‌రేష్. అత‌డి కంబ్యాక్ కోస‌మే ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దీనికి ఏదైనా సోలో సినిమాతో న‌రేష్ ధీటైన రిప్ల‌య్ ఇస్తారేమో చూడాలి.