Begin typing your search above and press return to search.
చైతన్యతో అల్లరోడి యుద్దం
By: Tupaki Desk | 18 Aug 2017 3:40 AM GMTఈ ఏడాది మొదటి ఆరు నెలలు ఒక ఎత్తు.. రాబోతున్న నాలుగు నెలలు ఒక ఎత్తు. ఇక నుండి విడుదలవ్వబోతున్న ప్రతి సినిమాకు ఒక క్రేజ్ ఉంది మంచి టీమ్ ఉంది. ఈ నెల కూడా కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని తమిళ్ డబ్బింగ్ సినిమాలు మరికొన్ని చిన్న సినిమాలు ఈ వారం సందడి చేయబోతున్నాయి. అలాగే ఎప్పటి నుండో రావాలి అనుకుంటున్న మరో యంగ్ స్టార్ హీరోలు సినిమాలు కూడా వచ్చే నెల మొదట వారంలో వస్తున్నాయి. ఒకటేమో కామిడీ ఫ్యామిలి డ్రామా మరొకటి ఏమో యాక్షన్ డ్రామా.
అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మేడ మీద అబ్బాయి’ ఇంకా నాగ చైతన్య హీరోగా నటించిన ‘యుద్దం శరణం’ రెండు వచ్చే సెప్టెంబర్ 8 న విడుదల చేయడానికి రంగం సిద్దం చేశారు. అసలు నాగ చైతన్య యుద్దం శరణం ఈ నెల 24 న విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని ప్రొడక్షన్ పనులు వలన కొంచం ఆలస్యం చేశారు. మరో విషయం ఏంటి అంటే అల్లరి నరేష్ మేడ మీద అబ్బాయి సినిమా కూడా ఇదే నెల 25 న విడుదల చేద్దాం అనుకున్నారు. మరి ఏ కారణాలు వలన పోస్ట్ పోన్ చేశారో తెలియదు కానీ గమ్మత్తుగా మళ్ళీ ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడానికి సిద్దపడ్డాయి. మొదటిసారి వీరిద్దరు సినిమాలు ఒకేసారి ఇలా విడుదలవుతూ పోటీకి సిద్దపడుతున్నాయి.
మేడ మీద అబ్బాయి సినిమాను మలయాళం డైరెక్టర్ జి. ప్రాజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళం సినిమా ఆదారంగా తీశారు. ఇకపోతే నాగ చైతన్య యుద్దం శరణం సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ ఎమ్.కృష్ణ చేస్తున్నాడు. నాగ చైతన్యకి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. మొత్తానికి రెండు సినిమాలూ ఫ్యామిలి డ్రామాలే అవ్వడం విశేషం. కాకపోతే ఒకటి కామిడీ మరొకటి యాక్షన్ అంతే తేడా. ఇంకా ఫ్యామిలి ప్రేక్షకులు అంతా సెప్టెంబర్ 8 కోసం రెడీ అయిపోవచ్చు.