Begin typing your search above and press return to search.

అల్ల‌రి ఇంట ఆయానా బార‌సాల వేడుక‌

By:  Tupaki Desk   |   18 Dec 2016 10:07 AM GMT
అల్ల‌రి ఇంట ఆయానా బార‌సాల వేడుక‌
X
టాలీవుడ్ కుర్ర హీరో అల్ల‌రి న‌రేశ్ ఇంట ఇటీవ‌ల బార‌సాల వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఆ వేడుక ఎవ‌రిద‌నుకుంటున్నారు? ఇంకెవ‌రిది... డాట‌ర్ ఆఫ్ అల్ల‌రి న‌రేశ్‌ దే. పేరు చెప్ప‌కుండా ఈ డాట‌ర్ ఆఫ్ ఏమిట‌నేగా మీ డౌటు? స‌రే... అల్ల‌రి న‌రేశ్ - విరూప దంప‌తుల‌కు ఇటీవ‌లే ఓ పండంటి పాప జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ముద్దులొలికే ఆ పాప ఫొటోను ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసిన అల్ల‌రి న‌రేశ్... త‌న కూతురును బ‌య‌టి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. తాజాగా అల్ల‌రి న‌రేశ్ త‌న ఇంటిలో కూతురు బార‌సాల వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించాడు.

ఈ వేడుకలో భాగంగా ఆయ‌న త‌న ముద్దుల కూతురుకు ఆయానా అవిక ఈద‌ర అని పేరు పెట్టాడు. అంటే... డాట‌ర్ ఆఫ్ అల్ల‌రి న‌రేశ్ పేరు ఆయానా అవిక అన్న‌మాట‌. బార‌సాల‌కు అల్ల‌రి న‌రేశ్ - అవిక త‌ర‌ఫు కుటుంబ స‌భ్యులు - బంధుమిత్రులు పెద్ద సంఖ్య‌లోనే హాజ‌ర‌య్యారు. ఇక అల్ల‌రి న‌రేశ్‌ కు టాలీవుడ్‌ లో అత్యంత క్లోజ్ ఫ్రెండ్‌ గా ఉన్న మ‌రో కుర్ర హీరో నాని త‌న స‌తీమ‌ణితో క‌లిసి ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యాడ‌ట‌. గ‌తేడాది మేలో విరూప‌ను అల్ల‌రి న‌రేశ్ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు మొన్న సెప్టెంబ‌ర్‌ లో అవిక జ‌న్మించింది. ఏడాది తిర‌క్కుండానే త‌న‌కు ఓ కూతురు పుట్ట‌డంతో అల్ల‌రి న‌రేశ్ ఆనందానికి హ‌ద్దే లేద‌ట‌. కూతురును ఒడిలో పెట్టుకుని, భార్య‌ను వెనుక నిబ‌లెట్టుకుని తీసుకున్న ఫొటోను ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసిన అల్ల‌రి న‌రేశ్‌... త‌నకూ ఓ కూతురు ఉందంటూ ఇటీవ‌ల సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కూతురి బార‌సాల వేడుక‌ను ఘ‌నంగా చేసిన అత‌డు ముద్దులొలికే అవిక‌ను చూసి తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నాడ‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/