Begin typing your search above and press return to search.

'బంగారుబుల్లోడు' పై భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ కమెడియన్!!

By:  Tupaki Desk   |   23 Jan 2021 6:10 AM GMT
బంగారుబుల్లోడు పై భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ కమెడియన్!!
X
టాలీవుడ్ లో 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అనే డైలాగ్ వినిపించగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కమెడియన్ పృథ్వీ. ఇండస్ట్రీ ఎన్నో ఏళ్లుగా నటుడుగా కొనసాగుతున్న పృథ్వీ.. కామిక్ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలలో నటించిన పృథ్వీ ఈమధ్య సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. చిన్న చిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన పృథ్వీ.. ప్రత్యేక కామెడీ శైలితో వందల సినిమాలు చేసాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన 'బంగారుబుల్లోడు' సినిమాలో మంచి క్యారెక్టర్ చేసానంటున్నాడు పృథ్వీ. ఆమధ్య కరోనా లాక్ డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధపడిన పృథ్వీ మళ్లీ తన కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.

అయితే భారీ గ్యాప్ తర్వాత నటించిన బంగారుబుల్లోడు సినిమా నేడు థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాను. ఖచ్చితంగా తనకు మళ్లీ సినిమా ఆఫర్స్ తప్పకుండా వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడట పృథ్వీ. కెరీర్ ఊపులో ఉన్నప్పుడు రాజకీయాలలో తిరిగిన పృథ్వీ.. ఎన్నో వివాదాలను కొనితెచ్చుకున్నాడు. అప్పటి నుండి ఆయనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దర్శకనిర్మాతలు కూడా పృథ్వీ రాజకీయాలలో ఉన్నాడు మళ్లీ వస్తాడో లేదో అని ఆఫర్స్ ఇవ్వలేదని ఇండస్ట్రీ టాక్. అయితే చాలకాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బంగారుబుల్లోడు సినిమాతో తన ప్రస్తుత పరిస్థితులు మారుతాయని, మళ్లీ మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చూడాలి మరి మళ్లీ పృథ్వీ ఫైర్ స్టార్ లా బిజీ అవుతాడేమో!