Begin typing your search above and press return to search.
ప్చ్.. 'అల్లరి'ని వదిలేస్తున్న నరేష్
By: Tupaki Desk | 30 Jun 2017 4:31 AM GMTకామెడీ హీరో అల్లరి నరేష్ సహజంగా జెట్ స్పీడ్ లో సినిమాలు చేసేస్తుంటాడు. కానీ ఇప్పుడా వేగం బాగా తగ్గిపోయింది. ఒకవైపు వరుసగా సినిమాలు ఫెయిల్ కావడం.. మరోవైపు తన కూతురుతో(ఇప్పుడు 9 నెలల వయసు) టైం స్పెండ్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. సినిమాల కౌంట్ బాగానే తగ్గింది.
అయితే.. తను చేసే సినిమాల సంఖ్య తగ్గడానికి అల్లరి నరేష్ మరో కారణం కూడా చెబుతున్నాడు. ఇకపై తాను తెగ అల్లరి చేసే కామెడీలు చేయాలని అనుకోవడం లేదని అంటున్నాడు. 'నా కెరీర్ లో నేను వెనుతిరిగి చూసుకుంటే.. శంభో శివ శంభో.. గమ్యం లాంటి సీరియస్ రోల్స్ నాకు పేరు తెచ్చి పెట్టాయి. కానీ ప్రేక్షకుల నుంచి కామెడీ సినిమాలకే ఎక్కువ డిమాండ్ రావడంతో వాటినే చేశాను. ఇప్పుడు ఆడియన్స్ తీరు మారింది. అందుకే నేను ఎంచుకునే సినిమాల స్టైల్ కూడా మారుతోంది. నా రాబోయే చిత్రం మేడ మీద అబ్బాయ్ లో కామెడీ అంతర్గతంగానే ఉంటుంది' అని చెబుతున్నారు అల్లరి నరేష్.
'ఇప్పుడు సమయం అంతా నా తొమ్మిది నెలల కూతురు అయాన ఎవికతో గడిపేందుకే కేటాయిస్తున్నాను. షూటింగ్ అయిపోగానే నేరుగా ఇంటికి వెళ్లిపోవడం.. తను పుట్టిన తర్వాత నాలో కొత్తగా వచ్చిన మార్పు. నా భార్యకు సినిమాల గురించి పెద్దగా తెలీదు. గమ్యంతో మరో రెండు సినిమాలు చూసి ఉంటుందంతే. తను కూడా నేను సీరియస్ రోల్స్ లోనే కనిపించాలని కోరుకుంటోంది' అని చెప్పిన అల్లరి నరేష్.. మహేష్ బాబు 25వ సినిమాలో ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే అని చెప్పాడు.
'ఇప్పుడే ఈ ప్రాజెక్టు గురించి కామెంట్ చేయడం సరైన విషయం కాదు. ఓ సారి దీని గురించి మాట్లాడుకున్నామంతే. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఒక వేళ రోల్ ఖాయం అయితే మాత్రం.. నేనే స్వయంగా అందరికీ చెబుతాను' అన్నాడు.. అల్లరి మానేస్తానంటోన్న అల్లరోడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/