Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ క‌టౌట్ కి త‌గ్గ క‌థ‌లే అన్నీ!

By:  Tupaki Desk   |   6 March 2023 11:28 AM GMT
ప్ర‌భాస్  క‌టౌట్ కి త‌గ్గ క‌థ‌లే అన్నీ!
X
'బాహుబ‌లి' స‌క్సెస్ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లైన‌ప్ అంతా ప‌క్కా ప‌క‌డ్భందీగా జ‌రుగుతోంది. 'సాహో' లాంటి భారీ యాక్ష‌న్ చిత్రం చేయ‌డం... అటుపై 'రాధేశ్యామ్' లాంటి రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో న‌టించ‌డం వంటివి ప్ర‌భాస్ కి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తీసుకొచ్చాయి. వాటి ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ప్ర‌భాస్ ఐడియాలిజీని ఆ చిత్రాలు రివీల్ చేస్తున్నాయి. హిందీ మార్కెట్ లో 'సాహో' స‌క్సెస్ అవ్వ‌డం కొంత వ‌ర‌కూ అక్క‌డ క‌లిసొచ్చింద‌న్న‌ది తెలిసిన వాస్త‌వం.

ఇక ప్ర‌స్తుతం డార్లింగ్ వ‌రుస‌గా బిగ్ ప్రాజెక్ట్ లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆదిపురుష్' తో బాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌డం....'స‌లార్' లాంటి భారీ యాక్ష‌న్ చిత్రం చేయ‌డం..'ప్రాజెక్ట్-కె' లాంటి సైన్స్ ఫిక్ష‌న్ సినిమా చేయ‌డం వంటివి ప్ర‌భాస్ ప్ర‌తిభ‌కి తార్కాణాలుగా చెప్పొచ్చు. వాటి ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే.. మిగ‌తా హీరోల‌కంటే యూనిక్ గా వెళ్తున్నాడు! అన్న ఓ గుర్తింపు జ‌నాల్లోకి బ‌లంగా వెళ్తుంది.

తాజాగా మ‌రో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్దార్ధ్ ఆనంద్ తో భారీ యాక్ష‌న్ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నారు. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా సిద్దార్ధ్ కి హిందీ ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరుంది. ఇప్పుడ‌త‌న్ని లాక్ చేసి డార్లింగ్ మ‌రో సినిమా చేస్తున్నాడంటే? ప్ర‌భాస్ ఎంత అడ్వాన్స్ గా ఉన్నాడ‌న్న‌ది మ‌రో సారి స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇక ప్ర‌భాస్ సినిమాలన్నింటిలో కామ‌న్ గా క‌నిపించే పాయింట్ ఒక‌టుంది.

అదే స్టోరీ. ప్ర‌భాస్ లాంటి మాస్ కటౌట్ కి త‌గ్గ స్టోరీలే ఇవ‌న్నీ. ఆయ‌న హైట్..వెయిట్..మాస్ ఫాలోయింగ్ వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన క‌థ‌లే. వీట‌న్నింటిని హీరో నుంచి పుట్టిన క‌థ‌లుగానే చెప్పాలి. బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్....జాన్ అబ్ర‌హం లాంటి స్టార్లు ఉన్నా సిద్దార్ధ్ ఆనంద్ కేవ‌లం డార్లింగ్ కోసం రాసిన యాక్ష‌న్ స్ర్కిప్ట్ ఇది. అత‌నితో సినిమా చేస్తే కొత్త ర‌క‌మైన కిక్ ఉంటుంద‌న్ని ప‌రిశ్ర‌మ మాట‌. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన స‌లార్ పోస్ట‌ర్లు చూస్తే! డార్లింగ్ పై ఎంతో అభిమానంతో..ప్రేమించి రాసిన క‌థ‌గా అద్దం ప‌డుతుంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా అదే త‌ర‌హాది. ఇలా ప్ర‌తీ ద‌ర్శ‌కుడి క‌థ‌లోనూ డార్లింగ్ ఇమిడి ఉన్నాడు! అన్న‌ది న‌మ్మాల్సిన నిజం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.