Begin typing your search above and press return to search.

15 అంత‌స్తుల ట‌వ‌ర్ నిర్మిస్తున్న స్టార్ క‌పుల్

By:  Tupaki Desk   |   9 April 2023 6:00 AM GMT
15 అంత‌స్తుల ట‌వ‌ర్ నిర్మిస్తున్న స్టార్ క‌పుల్
X
అలియా భట్ ప్రస్తుతం అనేక విధులు నిర్వహిస్తోంది. వాటిలో ఒకటి డ్రీమ్ హోమ్ (కలల ఇల్లు) నిర్మాణంలో పురోగతి ప‌రిశీల‌న‌. ఆమె వారి కొత్త నివాసం నిర్మాణ స్థలం నుండి తిరిగి వస్తున్నట్లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అలియా చాలా సింపుల్ గా క్యాజువల్ స్ట్రీట్ వేర్ లుక్ లో కనిపించింది. ఆమె బేసిక్ వైట్ ట్యాంక్ టాప్ ను- బ్యాగీ జీన్స్  సన్ గ్లాసెస్ తో స్టైలిష్ గా క‌నిపించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. RRR నటిగా ఆలియా పేరు ఇటీవ‌ల మార్మోగుతోంది.  అలియా - రణబీర్ ప్రస్తుతం తమ కుమార్తె రాహాతో కలిసి వారి కుటుంబ గృహమైన వాస్తులో నివ‌సిస్తున్నారు.

నిజానికి డిసెంబర్ 2022లో అలియా- రణబీర్ నిర్మాణ‌ సైట్ నుండి తీసుకున్న స్నాప్ లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీరి తనిఖీ చేస్తున్న సమయంలో వీరిద్దరూ అపార్ట్ మెంట్ లోని బాల్కనీలో కనిపించారు. ఆలియా టీమ్‌తో కలిసి ఇంటి గురించి ప్ర‌శ్నిస్తూ కనిపించింది. మరోవైపు రణబీర్ కపూర్ సైట్ కి సంబంధించిన‌ కొన్ని ఫోటోలను క్లిక్ చేశాడు.

బాంద్రాలోని 15-అంతస్తుల టవర్ లో ఈ జంట కపూర్ కుటుంబానికి ఐదు అంతస్తులు కేటాయించినట్లు తెలుస్తోంది. మొత్తం భ‌వంతి నిర్మాణం పూర్తి కావడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. అయితే మొదటి 5 అపార్ట్‌మెంట్లు ప్రాసెస్ లో ఉన్నాయి. టవర్ మొదటి - రెండవ అంతస్తుల అపార్ట్ మెంట్ లు దాదాపు నివాసానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి వరుసగా రణబీర్ కపూర్-ఆలియా భట్ - నీతూ కపూర్‌లకు చెందినవిగా భావిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆలియా భ‌ట్ రణబీర్ థియేట్రికల్ హిట్ బ్రహ్మాస్త్రలో కలిసి క‌నిపించారు. రణబీర్ చివరిసారిగా లవ్ రంజన్ కమర్షియల్ రొమాంటిక్ కామెడీ తు ఝూతి మైన్ మక్కార్ లో కనిపించాడు. తొలిసారి శ్రద్ధా కపూర్ అత‌డి సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఆ తర్వాత ర‌ణ‌బీర్ యానిమల్ అనే చిత్రంలో నటించనున్నాడు. గతంలో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అలియా గురించి చెప్పాలంటే... ఆమె త్వరలో కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో కనిపించనుంది. బ్లాక్ బస్టర్ గల్లీ బాయ్ తర్వాత ఆమె రెండోసారి రణ్ వీర్ సింగ్ తో జతకట్టనుంది. OTT చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్` ద్వారా అలియా హాలీవుడ్ లోకి దూసుకెళుతోంది. గాల్ గాడోట్ - జామీ డోర్నన్ లతో కలిసి స్పేస్ నేప‌థ్యంలోని ఈ మూవీలో న‌టిస్తోంది. ప్రియాంక చోప్రా - కత్రినా కైఫ్ లతో కలిసి నటించిన జీ లే జరా ఆలియా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లలో మరొకటి.

రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌కు ఆలియా గిఫ్ట్

రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న వేళ ఈ జంట‌కు అరుదైన‌ కానుక‌ను పంపించింది ఆలియా భ‌ట్. ఆలియా Ed-a-Mamma వ‌స్త్ర శ్రేణికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల‌ ఎన్టీఆర్‌ పిల్లలకు దుస్తులు పంపించిన ఆలియా ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కోసం అద్భుత‌మైన కానుక‌ను పంపింది. ఈ జంట‌కు పుట్టబోయే బేబీకి సంబంధించిన దుస్తులను ఆలియా పంపించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ ఆలియాకు థ్యాంక్స్ చెప్పారు. ఆలియా ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ సీత పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.