Begin typing your search above and press return to search.
NTR కోసం ED- వేర్ దుస్తుల రంగంలోకి ఆలియా?
By: Tupaki Desk | 26 March 2023 10:18 AM GMTRRR సీతగా ఆలియా భట్ తెలుగు లోగిళ్లలో అభిమానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భన్సాలీ దర్శకత్వం వహించిన గంగూభాయి కథియావాడీ.. జోయా అఖ్తర్ తెరకెక్కించిన గల్లీబోయ్ చిత్రాలను ఓటీటీల్లో వీక్షించాక ఇటు దక్షిణాదిన మరింతగా ఆలియాకు ఫాలోయింగ్ పెరిగింది. బాలీవుడ్ లో ఉన్న అరుదైన ప్రతిభావనిగా సౌత్ అభిమానులు ఆలియాను గుర్తించారు. ఆలియా ఇప్పుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకు క్లోజ్ ఫ్రెండ్. RRR చిత్రీకరణ సమయంలో ఆ ఇద్దరికీ బాగా క్లోజ్ అయింది. అంతేకాదు.. తన స్నేహితులకు అరుదైన కానుకలు కూడా పంపింది. ముఖ్యంగా ఆ సమయంలోనే ఎన్టీఆర్ కుటుంబాన్ని స్పెషల్ గిఫ్ట్ లతో ఆశ్చర్యపరిచింది.
ఎన్టీఆర్ పిల్లలు అభయ్ - భార్గవ్ లకు అలియా ఇప్పుడు తన సొంత శ్రేణి కిడ్స్ బ్రాండ్ దుస్తులను పంపింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ తన ఇన్ స్టాలో అలియా భట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ``ధన్యవాదాలు అలియా .. ఎప్పుడూ అభయ్ - భార్గవ్ ముఖాలపై చిరునవ్వు నింపుతావు.. త్వరలో నా పేరుతో ఒక బ్యాగ్ ని చూస్తానని ఆశిస్తున్నాను..`` అని ఆలియాపై తన అభిమానాన్ని కురిపించారు. దీనికి ప్రతిస్పందించిన ఆలియా భట్ .. మీకోసం ప్రత్యేకించి అడల్ట్ వేర్ దుస్తుల రంగంలో ప్రవేశిస్తానని సరదాగా వ్యాఖ్యానించింది. ``హాహా ..(స్మైల్ ఈమోజీ) నేను మీ కోసం మాత్రమే ప్రత్యేకమైన ఎడ్- వేర్ శ్రేణిని తయారు చేస్తాను. స్వీటెస్ట్ థాంక్స్`` అని వ్యాఖ్యానించింది. అల్లూరి సీతారామరాజు(చరణ్) సరసన సీతగా సుపరిచితురాలైన ఆలియా భట్ సెట్లో ఉన్న సమయంలో తారక్ కి ఎంతో గొప్ప స్నేహితురాలిగా మారింది. ఇక ఆలియా ఎంటర్ ప్రెన్యూర్ గాను సుపరిచితం. ఇటీవల పిల్లల దుస్తుల శ్రేణి వ్యాపారంలో ప్రవేశించి అగ్రగామిగా రాణిస్తోంది. 2021లో ఆలియా తన సొంత కిడ్స్ డ్రెస్సింగ్ లేబుల్ ని ప్రారంభించింది. కానీ తారక్ కోసం ఎడ్-వేర్ దుస్తుల రంగంలో ప్రవేశిస్తానని సరదాగా వ్యాఖ్యానించింది.
RRR విడుదలైన ఏడాది తర్వాత కూడా ఎన్టీఆర్ చరణ్ లతో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది ఆలియా. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ నాటు నాటుకు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న ఆనందాన్ని సోషల్ మీడియాల్లో తన అభిమానులతో పంచుకుంది. అంతర్జాతీయ అవార్డుల స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.