Begin typing your search above and press return to search.

'చాందినీ'లో శ్రీదేవి ఐకానిక్ స్టైల్లో అలియాభ‌ట్ !

By:  Tupaki Desk   |   3 March 2023 5:00 AM GMT
చాందినీలో శ్రీదేవి ఐకానిక్  స్టైల్లో అలియాభ‌ట్ !
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి బాలీవుడ్ కెరీర్ లో మ‌రో మైల్ స్టోన్ మూవీ 'చాందిని'. టైటిల్ పాత్ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయి గా శ్రీదేవి అభిన‌యం మురుపురానిది. అందులో శ్రీదేవి ఆహార్యం ఓ వండ‌ర్. చాందిని పాత్ర ఆమె అందానికి మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. చాందినితో శ్రీదేవి ఇమేజ్ రెట్టింపు అయింది. దేశ వ్యాప్తంగా ఆ సినిమాకు ఎంతో మంది అభిమానులున్నారు. అప్ప‌టికుర్ర‌కారును ఓఊపు ఊపిన రోల్ అది.

తాజాగా శ్రీదేవి చాందిని స్టైల్లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ మెప్పించ‌డానికి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఆమె క‌థానాయిక‌గా న‌టిస్తోన్న 'రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ' చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉంది. దీనిలో ఓ భాగంగా ఓ పాట చిత్రీక‌రిస్తున్నారు. ఈపాట‌లో అలియాభ‌ట్ అందాల తార‌ని మరిపించ‌బోతుంద‌ని తెలుస్తోంది. నాటి చాందినీగా శ్రీదేవి ఎంత‌గా ఫేమ‌స్ అయిందో..అదే త‌ర‌హాలో అలియాని ఫేమస్ చేసే ప్ర‌య‌త్నాలు ద‌ర్శ‌క‌..నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తీసుకున్నారు.

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని క‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'నాకు ఇష్ట‌మైన చిత్ర నిర్మాత‌కి అంకితం చేసే పాట‌ని చిత్రీక‌రిస్తున్నాను. ఇంత‌కు మించి అప్పుడే ఏమీ చెప్ప‌లేక‌పోతున్నాను' అని ఎగ్టైట్ అయ్యారు. అంటే క‌ర‌ణ్ అలియా న‌ట‌న విష‌యంలో ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారు అన్న‌ది ఈ సందేశాన్ని బ‌ట్టి తెలుస్తుంది. ఈ ప్ర‌త్యేక పాట‌లో శ్రీదేవి ఐకానిక్ స్టైల్లో అలియా భ‌ట్ క‌నిపించ‌బోతుంది.

దానికి సంబంధించి అల‌నాటి న‌టిని త‌ల‌పించేలా అలియాని త‌యారు చేస్తున్నారు. ఈ పాట కోసం ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా ఓ చీర‌ని డిజైన్ చేసారు. ఆచీర ధ‌రించి అలియా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌బోతుంది. అప్ప‌ట్లో చాందిని చిత్రాన్ని యశ్ చోప్రా స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ని క‌ర‌ణ్ జోహార్ ఎంతో అభిమానిస్తారు.

అందుకే ఈ పాట‌ని య‌శ్ చోప్రాకి అంకితం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో క‌ర‌ణ్ సింగ్...ధ‌ర్మేం ద్ర‌..జ‌యా బ‌చ్చ‌న్ క‌రీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి జులై 28న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే 'ఆర్ ఆర్ ఆర్' లో సీత పాత్ర‌తో అలియా భ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా శ్రీదేవి ఐకానిక్ సాంగ్ తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.