Begin typing your search above and press return to search.

జగన్ సెల్ఫీ వెనుక నిజమైన కథ ఇదీ..

By:  Tupaki Desk   |   27 July 2018 5:36 AM GMT
జగన్ సెల్ఫీ వెనుక నిజమైన కథ ఇదీ..
X
ఈ మధ్య పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన వైసీపీ అధినేత జగన్ ను ఆ హీరో అభిమానులు టార్గెట్ చేశారు. జగన్ పై అవాకులు - చెవాకులు ట్రోలింగ్ చేస్తున్నారు. జగన్ కుటుంబసభ్యులను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల రచ్చ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

తాజాగా జగన్ తో ఓ యువతి తీసుకున్న సెల్ఫీ ఫొటోను ట్రోలింగ్ చేస్తూ దాన్ని భూతద్దంలో చూపిస్తూ విచక్షణ రహితంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ తో సెల్ఫీ దిగిన ఆ అమ్మాయి పేరు అలేఖ్య ఏంజెల్. తాజాగా ఈమె ఈ ట్రోలింగ్ లపై మనస్థాపం చెంది ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. ‘ఓ తండ్రిలాగా.. ఓ పెద్దన్నలాగా జగన్ ని అందరూ భావిస్తుంటారు.. అదే ఉద్దేశంతో తాను జగన్ తో సెల్ఫీ దిగాను.’ పేర్కొంది. అలాంటి ఫొటోను పట్టుకొని అసభ్యకరంగా.. అభ్యంతరకరంగా కామెంట్లు చేయడం సరికాదని వాపోయింది. ఇదే మీ సోదరి విషయంలో జరిగితే ఇలానే చేస్తారా.? అని పవన్ కళ్యాణ్ అభిమానులను ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ కు కూడా తాను వ్యక్తిగతంగా వీరాభిమానినని.. ఇలాంటి చీప్ ట్రిక్స్ తో గ్రేట్ హీరో పరువు తీయొద్దని అలేఖ్య కాస్త గట్టిగానే హెచ్చరించింది.

అలేఖ్య వర్ధమాన హీరోయిన్. మిస్టర్ మణి, ఆనందం మళ్లీ మొదలైంది, లవ్ ఇన్ మలేషియా వంటి సినిమాల్లో నటించింది. మోడల్ గా రాణిస్తోంది. 2017 ఫిబ్రవరి 18న లోటస్ పాండ్ లోని జరిగిన ఓ మ్యూజిక్ ఆల్బం రిలీజ్ ఫంక్షన్ లో కుటుంబంతో కలిసి పాల్గొంది. అప్పుడే జగన్ తో సెల్ఫీ దిగానని చెప్పుకొచ్చింది. జగన్ తోనే కాదు.. వెంకటేశ్ - బాలయ్య సహా టాలీవుడ్ సినీ ప్రముఖులందరితో సెల్ఫీ దిగానని.. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికే నా ఫొటోను పవన్ అభిమానులు వాడుకుంటున్నారని అలేఖ్య మండిపడింది. ఇప్పటికైనా జగన్ తో తాను ఉన్న ఫొటోలను డిలీట్ చేయాలని కోరింది.