Begin typing your search above and press return to search.

ఉగ్రం నుంచి ఫ్యామిలీ సాంగ్ రిలీజ్

By:  Tupaki Desk   |   9 April 2023 11:41 AM GMT
ఉగ్రం నుంచి ఫ్యామిలీ సాంగ్ రిలీజ్
X
అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. నాంది లాంటి సూపర్ అందించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నరేశ్ నాంది సినిమాతో కథల ఎంపికలో మార్పులు తీసుకొచ్చాడు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఉగ్రం.. పేరుకు తగ్గట్లుగానే అల్లరి నరేష్ లుక్, బాడీ లాంగ్వేజ్ సీరియస్‌ గా ఉంది. ఇంటెన్స్ లుక్‌తో విలన్ల భరతం పట్టడమే కాకుండా, తనకు అలవాటు లేని పంచ్ డైలాగ్స్‌ను అదిరిపోయేలా ఈ సినిమాలో చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయాలను కున్నారు. ఆరోజున సమంత శాకుంతలం, రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఏం అనుకున్నారో తెలియదు కానీ... రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. మే 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ వదులుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ రిలిజ్ అయింది. అల్బెలా అల్బెలా అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా... ఈ పాటకు లిరిక్స్ భాస్కర భట్ల రాశారు. ఇక పాటలోని సాహిత్యం బాగుంది. ఈ పాటను రేవంత్, శ్రావణ భార్గవి అలపించారు. మొత్తానికి ఈ పాట రోమాంటిక్ మెలోడిలా వినసొంపుగా ఉంది.

ఎంత యాక్షన్ సినిమా అయినప్పటికీ... ఫ్యామిలీ ఎమెషన్స్ కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు తాజాగా విడుదల అయిన అల్బెలా సాంగ్ ను చూస్తే... ఇది ఒక ఫ్యామిలీ సంగ్ అని అర్థం అవుతుంది. ఇక ఈ పాటలో నరేష్ తో పాటు హీరోయిన్, వాళ్ల డాటర్ ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్‌ గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విజయ్ కనకమేడల వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.