Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ ఉగ్రం.. ఇలాంటి సాంగ్ ఊహించలేదు

By:  Tupaki Desk   |   8 April 2023 7:17 PM GMT
అల్లరి నరేష్ ఉగ్రం..  ఇలాంటి సాంగ్ ఊహించలేదు
X
ఒకప్పుడు ఎక్కువగా కామెడీ చిత్రాల్లోనే కనిపించి మెప్పించిన హీరో అల్లరి నరేష్.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వినూత్న చిత్రాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ఉగ్రం. ఈ చిత్రానికి తూమ్ వెంకట్ కథను అందిస్తుండగా... అబ్బూరి రవి డైలాగ్స్ కూడా రాస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నాయి. అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన దేవేరి వీడియో సాంగ్ ను ఇటీవలే విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అయితే తాజాగా చిత్రబృందం మరో సాంగ్ ను విడుదల చేయబోతోంది. అయితే ఈ సాంగ్ కు సంబంధించి ఓ టీజర్ ను నేడు రిలీజ్ చేసింది. అందులో అల్లరి నరేష్, మిర్ణా మీనన్.. బీచ్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ముందు బేబీ ఊహా రెడ్డిని చూపిస్తూ.. ఆ తర్వాత బీచ్ దగ్గర మిర్ణా ఉయ్యాలలో ఊగుతూ కనిపించింది. ఓ వైపు నుంచి అల్లరి నరేష్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చి మిర్ణా దగ్గర ఆగుతాడు. వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అయితే ఆల్బెల.. ఆల్బెల.. అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాటను భాస్కర భట్ల రాయగా... రేవంత్, శ్రావణ భార్గవిలు పాటను ఆలపించారు.

రేపు రిలీజ్ కాబోయే ఈ పాట కోసం అల్లరి నరేష్ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రానికి సిద్దార్థ్ జె సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, శరత్ లోహితస్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, మణికంఠ వారణాసి, నాగ మహేష్, రమేష్ రెడ్డి, బేబీ ఊహా రెడ్డిలు నటిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.