Begin typing your search above and press return to search.
అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ షాక్
By: Tupaki Desk | 19 May 2023 7:56 PM ISTఅక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన విషయం తెల్సిందే. దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కనీసం 20 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది.
సోనీ లివ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు గాను ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం జరిగింది. సినిమా థియేటర్ల వద్ద ఎలాగూ ప్రభావం చూపించలేక పోయింది.
దాంతో సినిమా ను ఓటీటీ లో అయినా వెంటనే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అందులో భాగంగానే ఈనెల 19వ తారీఖున అంటే నేటి నుండి స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది.
ఏజెంట్ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వలేదు. దాంతో అఖిల్ అభిమానులతో పాటు సినిమాను ఓటీటీ లో చూడాలని ఎదురు చూస్తున్న వారు సోనీ లివ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సోనీ లివ్ ను ట్రోల్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు.
సినిమా ఎలాగూ పోయింది కనుక థియేటర్ లో చూసేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన వారికి షాక్ ఇచ్చిన సోనీ లివ్ కొత్త స్ట్రీమింగ్ తేదీని ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
ఏజెంట్ సినిమా లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఇక హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే ఉద్దేశ్యంతో సినిమాను అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సినిమా షూటింగ్ మొదలు అయ్యే సమయంలో బౌండెడ్ స్క్రిప్ట్ లేదని అందుకే సినిమా ఫ్లాప్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.