Begin typing your search above and press return to search.
రూ.12 లక్షల సూపర్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో
By: Tupaki Desk | 25 May 2023 6:30 PM ISTఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలతో కంటే కూడా ఎక్కువగా బైక్ రైడింగ్ మరియు దేశ వ్యాప్తంగా ఆయన నిర్వహిస్తున్న ట్రిప్ గురించే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన దేశంలోని అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఒక భారీ రైడ్ ను ప్లాన్ చేసిన విషయం తెల్సిందే.
అజిత్ తో ఎక్కువ రైడ్స్ లో పాల్గొనే వారిలో సుగత్ ఒకరు. అజిత్ చేసిన ఎన్నో సాహసోపేత రైడ్స్ లో సుగత్ ముందు ఉంటాడు అని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సుగత్ కోసం అజిత్ ఏకంగా రూ.12 లక్షల రూపాయల విలువైన సూపర్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఆ BMW సూపర్‌బైక్ ని అజిత్ నుండి బహుమానంగా పొందిన సుగత్ చాలా సంతోషంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెళ్లడించాడు.
సుగత్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇటీవల నేపాల్‌మ రియు భూటాన్ రైడ్ ను పూర్తి చేసిన అజిత్ కుమార్ వెంటనే సుగత్ కూడా ఉన్నాడు.
గత కొంత కాలంగా సుగత్ డ్యూక్ 390 బైక్ ను నడుపుతున్న సుగత్ తాజాగా BMW సూపర్‌బైక్ ని బహుమానంగా పొందడంతో ఆయన ఫాలోవర్స్ మరియు అజిత్ అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
బైక్ రైడింగ్ లో నేను అజిత్ గారితో ఎన్నో ట్రిప్ కు వెళ్లాను. అవి నా జీవితంలో గుర్తుండి పోయే మధుర క్షణాలు. ఇప్పుడు ఆయన నుండి ఈ సూపర్ బైక్ ను పొందడం అంతకు మించిన సంతోషం అన్నట్లుగా సుగత్ పేర్కొన్నాడు.
ఇటీవలే అజిత్ ఔత్సాహిక రైడర్స్ కోసం అంటూ ఒక కంపెనీ కూడా ప్రారంభించబోతున్నాడు. అందులో భాగంగా రైడ్ పై ఆసక్తి ఉన్న వారికి గైడ్స్ ను ఏర్పాటు చేస్తారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక అజిత్ సినిమాల్లో కూడా బిజీ బిజీగా ఉన్నాడు.