Begin typing your search above and press return to search.
స్టార్ హీరో రూ.45 కోట్ల ప్రాపర్టీ వార్త వైరల్
By: Tupaki Desk | 5 July 2023 5:59 PM ISTఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాయి. ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హిందీ సినిమాలు ఇప్పుడు ఆ స్థాయి వసూళ్లు రాబట్టడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అయినా కూడా హీరోల పారితోషికం భారీగా పెరుగుతూనే ఉంది.
బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో అజయ్ దేవగన్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఆయన సంపాదన భారీగా ఉంది. తాజాగా అజయ్ దేవగన్ ముంబైలోని ఒక ప్రైమ్ ఏరియాలో ఐదు ఆఫీస్ యూనిట్లను అపార్ట్మెంట్ లో కొనుగోలు చేయడం జరిగిందట.
అపార్ట్‌మెంట్ లోని 16వ మరియు 17వ అంతస్తులో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఖరీదైన యూనిట్లను కొనుగోలు చేసేందుకు ప్రముఖులు పోటీ పడ్డారని.. అజయ్ దేవగన్ కి ఈ ప్రాపర్టీ దక్కిందని సమాచారం అందుతోంది. జాతీయ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.
కొన్ని నెలల క్రితం అజయ్ దేవగన్ భార్య కాజోల్ కూడా ముంబైలో ఖరీదైన ఏరియాలో అపార్ట్‌మెంట్ లో ప్లాట్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు అజయ్ దేవగన్ చాలా ఖరీదైన ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు.