Begin typing your search above and press return to search.

ప‌ల్లె ప‌ల్లెకో థియేట‌ర్ సాధ్య‌మే!?

By:  Tupaki Desk   |   24 Dec 2018 9:47 AM IST
ప‌ల్లె ప‌ల్లెకో థియేట‌ర్ సాధ్య‌మే!?
X
సాంకేతికత మారుతున్న ప్ర‌స్తుత ట్రెండ్ లో థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మార్చేసే సాంకేతిక‌త పుట్టుకొస్తుందా? అంటే అందుకు ఆస్కారం లేక‌పోలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నాయి. ఎక్క‌డో కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి వెళ్లి ప‌ల్లె వాసులు సినిమాలు చూడాల్సిన ప‌ని లేకుండా ప‌ల్లె ప‌ల్లెకు థియేటర్ల‌ను ఏర్పాటు చేసే ఆస్కారం లేక‌పోలేద‌ని విశ్లేషిస్తున్నారు. అధునాత‌న సాంకేతిక‌త‌తో త‌క్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేట‌ర్ల‌ను ప‌ల్లెల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్న ఆస్కారాన్ని కాద‌న‌లేమ‌ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెబుతున్నాయి.

తాజాగా క‌ర్నూలు (ఏపీ) రైల్వే స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఎయిర్ బెలూన్ థియేట‌ర్ ని ప్రారంభించారు. ఇందులో మ‌ల్టీప్లెక్స్ త‌ర‌హాలోనే అధునాత‌న సాంకేతిక‌తో స్క్రీన్ సెట‌ప్ చేయ‌డం విశేషం. ఎయిర్ బెలూన్ బెడ్స్ త‌ర‌హా సెట‌ప్ ఇది. ఇందులోనూ అత్యుత్త‌మ సౌండ్ సిస్ట‌మ్ స‌హా ఏసీ సెట‌ప్ ఉంది. ఉద‌యం గాలి ఊదితే థియేట‌ర్ గా మారుతుంది. సాయంత్రం గాలి తీసేస్తే సాధార‌ణ స్థ‌లంగా మారుతుంది. ఇక ఇందులో 120 మంది సినిమా చూసే వీలుంటుంది. ఒక మామూలు థియేట‌ర్‌లో వీక్షిస్తున్న ఎఫెక్ట్ ఇక్క‌డా క‌లుగుతోందిట‌. ఇటీవ‌లే ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం సార‌థ్యంలో దీనిని ప్రారంభించారు.

మ‌న‌సుంటే మార్గం లేక‌పోలేదు. ప్ర‌తిప‌ల్లెలోనూ మినీ థియేట‌ర్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి తెచ్చే ఆస్కారాన్ని కొట్టి పారేయ‌లేం. గ‌తం ప‌రిశీలిస్తే... 80-90ల‌లో ఊళ్ల‌లో వీధి బొమ్మ ఆడించేవారు. రామ‌కోవెల ద‌గ్గ‌ర ఖాళీ ఆట స్థ‌లంలో తెర క‌ట్టి చుట్టూ డేరాలు క‌ట్టి సినిమాలు ఆడించేవారు. దానికి టిక్కెట్టు డ‌బ్బులు కూడా వ‌సూలు చేసేవారు. కొంద‌రు టీవీ అంటే ఏంటో తెలీని రోజుల్లో టీవీ- వీసీఆర్-వీసీడీ సెట‌ప్ తో ప‌ల్లెల్లో సినిమాలు ఆడించేవారు. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. అధునాత‌న సాంకేతిక‌త‌తో అన్ని న‌గ‌రాల్లో థియేట‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లోనూ మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ విస్త‌రిస్తోంది. ఇక‌పోతే టీవీ రంగం అభివృద్ధి చెంది ప్ర‌స్తుతం టీవీ సీరియ‌ళ్ల వ్య‌వ‌స్థ ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.