ఇంటింటికీ తిరిగి షాంపూలు అమ్మిన వాడిని!
బాలీవుడ్ స్టార్ అర్షద్ వార్షీ గురించి పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.
By: Srikanth Kontham | 2 Jan 2026 7:00 PM ISTబాలీవుడ్ స్టార్ అర్షద్ వార్షీ గురించి పరిచయం అవసరం లేదు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. మునుపటి కంటే సినిమాల వేగం కూడా పెరిగిందిప్పుడు. అవకాశాలు అలాగే అందుకుంటున్నాడు. ఇదంతా ఇప్పుడు. కానీ అర్షద్ గతంలోకి వెళ్తే అతడి జీవితంలోనూ చాలా కష్టాలున్నాయి. 16 ఏళ్లకే తండ్రిని కోల్పోవడం. బ్రతుకు సాగించడం కోసం ప్రయివేట్ ఉద్యోగాలు చేయడం..ఆపై బాలీవుడ్ ఎంట్రీ ఎంతో ఆసక్తికరం.
ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు అర్షద్ వార్షీ. తండ్రి అహ్మద్ అలీఖాన్ హార్మోనియం వాయించేవారు. ఊర్దులో పాటలు రాసేవారు. అర్షద్ చిన్నప్పటి నుంచి హాస్టల్ లోనే. సెలవులకు మాత్రమే ఇంటికెళ్లేవాడు. అయితే అ్మద్ అలీఖాన్ ది జాలి గుండె. ఆ దాతృహృదయం కారణంగా కుటుంబం ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడింది. దాన ధర్మాలు చేయడం..అడిగిన వాళ్లకు ఏం కావాలన్నా? ఇచ్చేయడం అలవాటు. ఎవరో అడిగితో గోల్డ్ లైటర్ ని దానం చేసాడు. ఇంట్లో ఉండే ఓ పెద్ద కారు కూడా బంధువులు అడిగితే ఇచ్చేసారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ ఇంటికి వస్తే అతిది మర్యాదల్లో ఎక్కడా లోపం లేకుండా చేసే వారు. ముంబైలో రెండు భవంతలు కూడా ఉండేవట. అయితే వాటిని కూడా కోర్టు ఆర్డర్ ద్వారా అద్దెకు ఉండేవారు స్వాదీనం చేసుకున్నారుట. దీంతో కొన్ని ఆస్తులను వేరే వాళ్ల పేరు మీద పెట్టడంతో వారు కూడా మోసం చేసారుట. అలా ఉన్నదంతా అర్షద్ వార్షీ కుటుంబం కోల్పోయింది. అర్షద్ 16 ఏళ్ల వయసులో తండ్రి మరణించాడు. అనంతరం అర్షద్ జీవితం మారిపోయింది. అప్పటి వరకూ పార్టీలు..పబ్ లు అంటూ తిరిగిన అర్షద్ వార్షీ పై కుటుంబ బారం పడింది.
అప్పటి నుంచి అన్ని వదిలేసి పని చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఓ షాంపు కంపెనీలో సేల్స్ బోయ్ ఉద్యోగం కూడా చేసాడు. ప్రయివేట్ ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదించుకుని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1993 లో రిలీజ్ అయిన `రూప్ కీ రాణీ చోరాన్ కా రాజా` చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ మధ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలుగింట ఎంతో ఫేమస్ అయ్యాడు. ప్రతిగా ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసాడు.
