Begin typing your search above and press return to search.

తండ్రి బాటలోనే తనయుడు కూడా.. అర్జున్ -సానియా మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో అటు క్రీడారంగంలో చాలామంది తమకంటే వయసులో పెద్దవారితో వివాహానికి సిద్ధమవుతున్నారు.

By:  Madhu Reddy   |   17 Aug 2025 9:00 PM IST
తండ్రి బాటలోనే తనయుడు కూడా.. అర్జున్ -సానియా మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
X

సినిమా ఇండస్ట్రీలో అటు క్రీడారంగంలో చాలామంది తమకంటే వయసులో పెద్దవారితో వివాహానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా పెళ్లి అంటేనే అబ్బాయి వయసు ఎక్కువ ..అమ్మాయి వయసు తక్కువ ఉండాలి అని చెబుతారు. కానీ ఇప్పుడు చాలామంది ఇందుకు వ్యతిరేకంగా వయసులో తమకంటే పెద్దవారిని వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజంగా పేరు సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్.. త్వరలో తన కొడుకు అర్జున్ టెండూల్కర్ వివాహాన్ని జరిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి జాడలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఆమె వయసు ఎంత? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. సానియా చందోక్ తో ఆగస్టు 13న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక సానియా విషయానికి వస్తే.. 1998 జూన్ 23న జన్మించారు అంటే ఆమె వయసు 26 సంవత్సరాలు.. అటు అర్జున్ 1999 సెప్టెంబర్ 24న జన్మించారు. ఆయనకు ఇప్పుడు 25 సంవత్సరాలు మాత్రమే.. అంటే ఇద్దరి మధ్య వయసు తేడా ఒక సంవత్సరం మూడు నెలలు.. యాదృచ్ఛికంగా అర్జున్ తన సోదరీ సారా కంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు కావడం గమనార్హం. మొత్తానికైతే అర్జున్ కూడా తన తండ్రి బాటలోనే తనకంటే వయసులో సంవత్సరం మూడు నెలలకు పెద్దదైన సానియాతో ఏడడుగులు వేయబోతున్నారు.

సచిన్ విషయానికి వస్తే.. సచిన్ 1995లో అంజలిని వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరిద్దరి మధ్య 5 సంవత్సరాలు తేడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంజలి వృత్తిరీత్యా వైద్యురాలు.. పెళ్లి తర్వాత తన వృత్తిని వదిలిపెట్టిన ఈమె.. భర్త , పిల్లల్ని చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది.

ఒక సానియా విషయానికి వస్తే.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఈమె.. 2020లో దేశానికి తిరిగి వచ్చి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఈమె జంతు ప్రేమికురాలు కూడా.. ఈమె ఎవరో కాదు ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సొంతం చేసుకున్న రవి ఘాయ్ మనవరాలు. ఈయన గ్రావిస్ గ్రూప్ యజమాని. ఈ గ్రూప్ బాస్కిన్ - రాబిన్స్ ఇండియా.. బ్రూక్లిన్ క్రీమరీ ఐస్ క్రీమ్ లాంటి బ్రాండ్లను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా ఈ కుటుంబానికి చెందిందే కావడం గమనార్హం. గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 - 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.624 కోట్ల టర్నోవర్ సాధించింది. హాస్పిటల్ కి రంగాల్లో కూడా వీరి వ్యాపారం కొనసాగుతోంది. గౌరవ్ ఘాయ్, తాత రవిఘాయ్ తో కుటుంబ వివాదాలు ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.