రహస్యంగా నిశ్చితార్థం.. పెళ్లి మాత్రం ధూమ్ ధామ్..
క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ మేరకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.
By: Madhu Reddy | 7 Jan 2026 6:14 PM ISTక్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ మేరకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇకపోతే గత ఏడాది నిశ్చితార్ధాన్ని అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్న అర్జున్ టెండూల్కర్ ఈసారి ధూంధాం గా తన పెళ్లిని చేసుకోబోతున్నట్లు సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్ ను వివాహం చేసుకోబోతున్నారు.ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఇరువురు నిశ్చితార్థం చేసుకోగా.. ఆ సమయంలో సోషల్ మీడియాలో వీరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో సచిన్ టెండూల్కర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను ప్రశ్నించగా .. అభిమానుల కోసం అధికారికంగా ఎక్స్ వేదికగా సచిన్ స్పందిస్తూ.. అర్జున్ వచ్చే ఏడాది కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు
ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అర్జున్ - సానియాల వివాహం 2026 మార్చి 5న జరగనుంది. ఇక వివాహానికి ముందు వేడుకలు మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయిఇకపోతే నిశ్చితార్థంతో ఒకటైన ఈ జంట ఈ ఏడాది ఏడడుగులు వేయబోతున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, క్రికెట్ ప్రపంచం నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుందని నివేదికలు కూడా వెలువడుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు సచిన్ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే.. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కి మారారు. ఈ సంవత్సరం ఆయన కెరియర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా చిరస్మరణీయమైన సంవత్సరముగా మిగిలిపోతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఐపీఎల్ కొత్త సీజన్ కి సిద్ధమవుతూనే మరొకవైపు పెళ్లి పేరుతో వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తీసుకోబోతున్నారు..
మరోవైపు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకోబోతున్న సానియా చందోక్ విషయానికి వస్తే.. ఈమె ఎవరో కాదు ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు. ఈయన హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈయన అడుగుజాడల్లోనే సానియా కూడా ఆంత్రప్రేన్యూర్ గా రాణిస్తున్నారు.అలాగే సానియా సొంతంగా పెంపుడు జంతువుల సంరక్షణ బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. అటు సచిన్ ఫ్యామిలీకి ఇటు సానియా ఫ్యామిలీకి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగానే ఇప్పుడు వీరి వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు.
