Begin typing your search above and press return to search.

చిరంజీవి మెచ్చిన కథతో సీతా పయనం.. కూతురు కోసం అర్జున్ ఏం చేశారంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ తన దర్శకత్వ ప్రతిభతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు.

By:  Madhu Reddy   |   9 Feb 2026 6:00 AM IST
చిరంజీవి మెచ్చిన కథతో సీతా పయనం.. కూతురు కోసం అర్జున్ ఏం చేశారంటే?
X

యాక్షన్ కింగ్ అర్జున్ తన దర్శకత్వ ప్రతిభతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన 'సీతాపయనం' చిత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కెరీర్ కోసం తండ్రిగా ఆయన పడిన తపన, ఈ కథకు మెగాస్టార్ చిరంజీవి అందించిన ప్రోత్సాహం సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. వాలెంటైన్స్ డే కానుక గా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది ..

మెగాస్టార్ చిరంజీవి సలహా:

'సీతాపయనం' కథ గురించి అర్జున్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కథ మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ఇష్టమని, ఆయనకు కథ మొత్తం క్షుణ్ణంగా తెలుసని వెల్లడించారు. కథలో ఉన్న బలం చూసి, ఇందులోని ఒక కీలక పాత్ర కోసం ఒక అద్భుతమైన నటుడిని ఎంపిక చేయమని చిరంజీవి ప్రత్యేకంగా సూచించారట. ఆయన సలహాతో అర్జున్ ముందుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయారు. దీంతో ఆ పాత్రలో కొన్ని మార్పులు చేసి, తన కుమార్తె కోసం తానే ఆ రోల్ ప్లే చేయాలని అర్జున్ నిర్ణయించుకున్నారు.

కుమార్తె ఐశ్వర్య కోసం తండ్రిగా అర్జున్ తపన:

ఒక దర్శకుడిగానే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఐశ్వర్య అర్జున్ కెరీర్‌ను సరైన దారిలో పెట్టాలని అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిరంజన్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రతి ఫ్రేమ్ ఎంతో ప్యాషనేట్‌గా రూపొందించారు. కుమార్తెను వెండితెరపై ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించాలనే ఉద్దేశంతో, స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మార్పులు చేర్పులు చేశారు. విజయ్ సేతుపతి చేయాల్సిన ఆ పవర్ ఫుల్ పాత్రను అర్జున్ స్వయంగా పోషించడం వల్ల సినిమాకు మరింత క్రేజ్ లభించింది. తన అనుభవాన్ని అంతా రంగరించి కుమార్తె కోసం ఆయన చేసిన ఈ 'సీతాపయనం' ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని ఆయన నమ్ముతున్నారు.

ప్రేమికుల రోజున వస్తున్న సందేశాత్మక చిత్రం:

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న 'సీతాపయనం' కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, అర్జున్ మార్క్ ఎమోషన్స్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. చిరంజీవి వంటి స్టార్ హీరో మెచ్చిన కథ కావడం, యాక్షన్ కింగ్ మళ్లీ మెగాఫోన్ పట్టడం అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. తన కుమార్తెను సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా చూడాలనే అర్జున్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో తెలియాలంటే ఈ నెల 14 వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ కింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రయాణం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుందాం.