శత్రువులుగా మొదలై మిత్రులయ్యారా?
సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఫ్రెండ్స్ అవుతారో..ఎప్పుడు ఏ సంఘటన వల్ల విడిపోతారో చెప్పడం కష్టం.
By: Tupaki Entertainment Desk | 17 Feb 2026 6:00 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలా ఫ్రెండ్స్ అవుతారో..ఎప్పుడు ఏ సంఘటన వల్ల విడిపోతారో చెప్పడం కష్టం. అయితే యాక్షన్ కింగ్ అర్జున్, జగ్గూ భాయ్ జగపతిబాబు ఫ్రెండ్షిప్ మాత్రం అందకు పూర్తి భిన్నం. రెండున్నర దశాబ్దాలుగా వారి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. అయితే ఇద్దరు ముందు శత్రువులయ్యారట. ఆ తరువాతే ప్రాణ స్నేహితులుగా మారారట. ఈ విషయాన్ని తాజాగా జగపతిబాబు, అర్జున్ వెల్లడించారు. అర్జున్ తన ముద్దుల కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా రూపొందించిన మూవీ `సీతాపయనం`.
ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ పోడ్‌కాస్ట్‌లో జగపతిబాబు మాట్లాడుతూ అర్జున్‌తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ నేను ఒక దశలో శత్రువులుగా మారాం. ఒకరిని ఒరం హేట్ చేసుకునే వాళ్లం. ఆ తరువాతే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇప్పుడు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అర్జున్ చాలా ఇంటలిజెంట్. నేనేమో చాలా డమ్ పర్సన్‌ని. నేను చేసేవన్నీ యదవ పనులే. దాటిని తను ఎలా తట్టుకుంటున్నాడని నాకో క్వశ్చన్ ఉండేది.
యూఎస్‌లో ఒకసారి నేను మిస్సయ్యాను. ఏమైపోయానో తెలియదు. ఎక్కడికి వెళ్లానో..ఎప్పుడొస్తానో తెలియదు అంటూ అర్జున్‌ని ప్రశ్నించారు. ఆ విషయం ఇప్పుడు చెప్పాలా.. చెప్పమంటే చెప్పేస్తాను` అని అనడంతో నాకేం అభ్యంతరం లేదు నిరభ్యంతరంగా చెప్పు అన్నారు. అదే టైమ్‌లో జగపతిబాబు అంటే తనకు ఎంత ఇష్టమో అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ హిపోక్రసీ అనేది ఉంటుంది. ఏమంటే ఎవరేమనుకుంటారో అని అంతా అనుకుంటారు. కానీ జగపతిబాబు మాత్రం ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తుంటాడు.
అది నాకు చాలా ఇష్టం. అతను ఎక్కడున్నా..ఎలా ఉన్నా తన కోసం మాత్రం నేను ఎప్పుడూ ఉంటాను` అని చెప్పి ఇద్దరి మధ్య ఉన్న స్నేహబందం ఎంత స్ట్రాంగ్ అన్నది స్పష్టం చేశాడు అర్జున్. ఆ మాటలకు జగపతి బాబు స్పందిస్తూ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్‌లా నువ్వున్నావు కానీ నీకు కావాల్సిన టైమ్‌లో నేను లేన్నాడు. `సీతా పయనం`లో నేనూ నటించాల్సింది. ఈ సందర్భంగా నిజాయితీగా మంచి సినిమాను మిస్సయానని క్షమాపణ చెబుతున్నాను` అంటూ చెప్పుకొచ్చారు.
2001లో మలయాళ హిట్ మూవీ `తెన్ కాశీపట్టణం` ఆధారంగా ఎడిటర్ మోహన్ సమర్పణలో మోహన్ రాజా రూపొందించిన మూవీ `హనుమాన్ జంక్షన్`. ఈ మూవీలో తొలిసారి కలిసి నటించిన అర్జున్, జగపతిబాబు మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అదే స్నేహంగా మారింది. రెండు దశాబ్దాలకు పైగా వారి స్నేహబంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
