సీతా పయనం హీరో ఎవరంటే?
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, అర్జున్, అతని కూతురు ఐశ్వర్యా అర్జున్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Feb 2026 2:54 PM ISTయాక్షన్ కింగ్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ సర్జా. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా సినిమానే సీతా పయనం. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రూపొందుతున్న సీతా పయనం వేలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
సెన్సార్ టీమ్ నుంచి మంచి టాక్
అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండగా, నిరంజన్ హీరోగా నటిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న ధృవ సర్జా కూడా ఈ మూవీలో ఓ స్పెషల్ క్యామియో చేశారు. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ యూనిట్ నుంచి పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకుంది సీతా పయనం బృందం.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, అర్జున్, అతని కూతురు ఐశ్వర్యా అర్జున్ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే అర్జున్ ఈ సినిమా గురించి, మిగిలిన అంశాలపై మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా అర్జున్ మూవీలోని క్యారెక్టర్లు మరియు హీరో గురించి ఓ విషయాన్ని రివీల్ చేశారు.
నా కూతురి కంటే అతని పాత్రే బావుంటుంది
సీతాపయనం మూవీలో హీరోగా నటించింది కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకేనని, తాను ఈ మూవీని తన కూతురి కోసం తీసినా, అందులో హీరోయిన్ కు సమానంగా, ఇంకా చెప్పాలంటే అందరికంటే కూడా హీరో పాత్రే చాలా బావుంటుందని, మూవీలో హీరోహీరోయిన్ల వయసులు తక్కువైనప్పటికీ, వారికి పడ్డ ఎలివేషన్లు, వారి క్యారెక్టర్లకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, వారి యాక్టింగ్ అందరినీ మెప్పిస్తుందని అర్జున్ చెప్పారు.
అర్జున్ ఈ విషయాలు చెప్పిన తర్వాత సీతాపయనం మూవీపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే పలు భాషల్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను డైరెక్టర్ గా ఎలా డీల్ చేశారనేది చూడ్డానికి అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. పైగా ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచడంతో సీతా పయనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
