యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో త్వరలో పెళ్ళి బాజాలు?
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో త్వరలోనే పెళ్ళి బాజాలు మోగనున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.
By: Madhu Reddy | 4 Jun 2026 10:39 AM ISTయాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో త్వరలోనే పెళ్ళి బాజాలు మోగనున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆయన చిన్న కూతురు అంజనా సర్జా ఈ అక్టోబర్‌లో ఓ ఇంటి కోడలు కాబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే, దీనిపై అర్జున్ ఫ్యామిలీ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవైపు ఈ పెళ్ళి ముచ్చట్లు నడుస్తుండగానే, మరోవైపు అంజనా ప్రొఫెషన్ గురించి తెలిసిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
అర్జున్ లెగసీ.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్:
కన్నడ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన నటుడు అర్జున్ సర్జా. అప్పట్లో ఆయన నటించిన యాక్షన్ సినిమాలు తెలుగులోకి డబ్ అయి ఇక్కడ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఇక హీరోగా మనల్ని ఎంతో మెప్పించిన అర్జున్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్‌ఫుల్ సహాయ నటుడిగా,నిర్మాతగా దూసుకుపోతున్నారు.
ఫ్యాషన్ వరల్డ్‌లో అంజనా క్రేజ్:
అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అందరికీ నటిగా తెలుసు. కానీ, చిన్న కూతురు అంజనా మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్' లో చదువుకున్నారు. ఇక ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉంటూ ఫ్యాషన్ డిజైనర్‌గా, మోడల్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు, పర్యావరణ హితమైన వేగన్ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్ బ్రాండ్ 'SARJAA' కు ఆమె ఫౌండర్ మరియు CEO. పండ్ల వ్యర్థాలతో యాపిల్, పైనాపిల్, కాక్టస్ తో ఈ బ్యాగ్‌లను తయారు చేయడం ఆమె ప్రత్యేకత.
13 ఏళ్ళ ప్రేమ.. లేక్ కోమోలో నిశ్చితార్థం:
అంజనా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, ఆమె ఒక అమెరికన్‌తో గత 13 సంవత్సరాలుగా లవ్‌లో ఉన్నారు. విదేశాల్లో కలిసి చదువుకున్నప్పటి నుంచి వీరి బంధం కొనసాగుతోంది. గతేడాది కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలోని ఫేమస్ 'లేక్ కోమో' లో వీరిద్దరి నిశ్చితార్థం చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇన్నేళ్ల తమ సుదీర్ఘ ప్రేమ బంధాన్ని త్వరలోనే పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లనున్నారు.
అక్టోబర్ మ్యారేజ్.. క్లారిటీ రావాల్సి ఉంది:
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ లవ్ బర్డ్స్ అక్టోబర్‌లో వివాహం చేసుకోబోతున్నారట. పెళ్ళికి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయని టాక్. అయితే, అర్జున్ సరదాగా తన అల్లుళ్ల హైట్ గురించి, పర్సనాలిటీ గురించి జోకులు వేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఈ పెళ్ళి తేదీపై అర్జున్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక త్వరలోనే అర్జున్ దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనా సినిమాల్లో యాక్షన్ కింగ్‌గా మెప్పించిన అర్జున్, రియల్ లైఫ్‌లో తన ఇద్దరు కూతుళ్లను ఎంతో అద్భుతంగా పెంచారు. ఒకరు నటిగా, మరొకరు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉమెన్‌గా సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు చిన్న కూతురు కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతుండటం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది. ఇక ఈ క్రేజీ వెడ్డింగ్ అప్‌డేట్‌పై అర్జున్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరిలాగే మనము వెయిట్ చేద్దాం..
